Moviesవీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య టిక్కెట్లు కావాలా.... లింక్ క్లిక్ చేసి పండ‌గ...

వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య టిక్కెట్లు కావాలా…. లింక్ క్లిక్ చేసి పండ‌గ చేస్కోండి ..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొద‌మ‌సింహాల్లో త‌ల‌ప‌డేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల మ‌ధ్య అనేకానేక పోలిక‌ల‌తో పాటు విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది. రెండు సినిమాల‌ను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

రెండు సినిమాల్లోనూ శృతీహాస‌న్ హీరోయిన్‌. ఇక చిరు, బాల‌య్య‌లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంక్రాంతికి పోటీ ప‌డితే ఆ మ‌జా ఎలా ? ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే రెండు సినిమాల స్టిల్స్‌, వీడియోలు, గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్స్‌తో పాటు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్‌ను ఎలా ? ఆక‌ట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. రెండు సినిమాల‌లో ఒక రోజు ముందుగా వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

ఆ మ‌రుస‌టి రోజే జ‌న‌వ‌రి 13న వాల్తేరు వీర‌య్య రిలీజ్ అవుతోంది. అయితే రెండు సినిమాలు కూడా ఒక్క రోజు ముందే యూఎఎస్‌లో ప్రీమియ‌ర్ అవుతున్నాయి. ఇక ఓవ‌ర్సీస్‌లో రెండు సినిమాల కోసం అభిమానులు అప్పుడే ర‌చ్చ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు సినిమాలో ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల కోసం ఈ నెల 29న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

ఏపీ, తెలంగాణ‌లో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తార‌న్న‌ది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీర సింహారెడ్డి సినిమాకు థమన్, వాల్తేరు వీరయ్యకు రాక్‌స్టార్‌ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news