Moviesబాల‌య్య కోసం ప‌వ‌న్ చేస్తోన్న త్యాగం ఇదే...!

బాల‌య్య కోసం ప‌వ‌న్ చేస్తోన్న త్యాగం ఇదే…!

నంద‌మూరి న‌ట‌సింహం బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సూపర్ సక్సెస్ కొట్టేసింది. ఒక‌టి రెండు ఎపిసోడ్లు మిన‌హా సీజ‌న్ 2లో బాల‌య్య హోస్ట్ చేసిన అన్నీ ఎపిసోడ్లు బాగా పేలుతున్నాయి. త్వ‌ర‌లోనే మూడు ఎపిసోడ్లు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. ముందుగా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌- బాల‌య్య ఎపిసోడ్‌, ఆ వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌య్య‌.. ఆ త‌ర్వాత జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, రాశీఖ‌న్నాతో బాల‌య్య చేసిన చిలిపి షో కూడా వ‌రుస‌గా ఆహాలో రానున్నాయి.

Unstoppable 2 with NBK Episode 5 OTT Release Date: Prabhas and Gopichand  will Come Together - MySmartPrice

ఈ మూడు ఎపిసోడ్ల‌పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ప్ర‌భాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్లు అయితే మామూలు ర‌చ్చ క్రియేట్ చేయ‌వ‌నే అంద‌రూ అంటున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ షూట్ కానున్న‌ట్టు ఇప్ప‌టికే ఆహా ప్ర‌క‌టించేసింది. ప‌వ‌న్ కూడా రీసెంట్‌గా వీర‌సింహారెడ్డి షూటింగ్‌లో ఉన్న బాల‌య్య‌ను క‌లిసి వ‌చ్చారు. ఆ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఈ ఎపిసోడ్ విశేషాల‌తో పాటు రాజ‌కీయ ప‌ర‌మైన అంశాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయంటున్నారు.

ఇక ప‌వ‌న్ ఎపిసోడ్‌లోనే ప‌వ‌న్‌తో పాటు మ‌ధ్య‌లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా గెస్టుగా వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.. ఇక ఈ ఎపిసోడ్ షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న అంటే మంగ‌ళ‌వారం ఈ ఎపిసోడ్ షూట్ చేయ‌నున్నారు. ఈ షూటింగ్ కోసం.. ప‌వ‌న్ త‌న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్‌కు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చి మ‌రీ బాల‌య్య ద‌గ్గ‌ర‌కు రానున్నాడు.

ఈ ఎపిసోడ్‌లోనే మ‌రో ట్విస్టు కూడా ఉందంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్‌తో పాటు ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా గెస్టుగా చివ‌ర్లో క‌నిపిస్తార‌ట‌. ఇక బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకు ప‌వ‌న్ గెస్టుగా వ‌స్తే ఎలాంటి ప్ర‌శ్న‌లు ఉంటాయ‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఏదేమైనా బాల‌య్య‌, ప‌వ‌న్‌ను ఒకే వేదిక మీద చూడ‌డ‌మే చాలా ఆనందం.

అలాంటిది బాల‌య్య ప్ర‌శ్న‌లు, ప‌వ‌న్ ఆన్స‌ర్లు.. ఇద్ద‌రి వ్య‌క్తిగ‌త విష‌యాలు అంటే షో ఏ రేంజ్‌లో పేలిపోతుందో చెప్ప‌క్క‌ర్లేదు. అటు నంద‌మూరి, ఇటు మెగాభిమానులు అంద‌రికి ఈ షోతో ఫుల్ మీల్స్ ప‌క్కా. ఇక వ్యూస్ ప‌రంగాను ఈ షో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంద‌నే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news