Moviesవీర‌సింహారెడ్డికి అదొక్క‌టే బ్యాలెన్స్‌... బాల‌య్య లెక్క‌లు స‌రిచేసేస్తాడా...!

వీర‌సింహారెడ్డికి అదొక్క‌టే బ్యాలెన్స్‌… బాల‌య్య లెక్క‌లు స‌రిచేసేస్తాడా…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ వీర‌సింహారెడ్డి. అఖండ లాంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా త‌ర్వాత బాలయ్య న‌టిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. అటు క్రాక్‌తో సూప‌ర్ హిట్ కొట్టి ఫుల్ స్వింగ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్‌, శృతీహాస‌న్ హీరోయిన్‌గా చేయ‌డం, అటు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషించ‌డం, అఖండ విజ‌యంలో వెన్నుముక‌గా నిలిచిన థ‌మ‌న్ మ్యూజిక్ ఇస్తుండ‌డంతో పాటు బాల‌య్య‌కు క‌లిసి వ‌చ్చిన రెడ్డి టైటిల్ సెంటిమెంట్‌, రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం కావ‌డంతో వీర‌సింహారెడ్డి ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌నే అంటున్నారు.

ఇక జై బాల‌య్య సాంగ్ కూడా బాగా క్లిక్ అయ్యింది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఒకే ఒక్క సాంగ్ మాత్రం షూట్ చేయాల్సి ఉంద‌ట‌. ద‌ర్శ‌కుడు గోపీచంద్ క్లైమాక్స్‌ను కూడా అదిరిపోయే రేంజ్‌లో చిత్రీక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి.

ఓవ‌రాల్‌గా వీర‌సింహారెడ్డి షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. వ‌చ్చే యేడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లో మాస్ జాత‌ర‌కు రెడీ అయిపోతోంది. ఇప్ప‌టికే జ‌న‌వ‌రి 12న వ‌స్తున్నా అంటూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ కూడా వ‌దిలేశారు. ఇక అదే రోజు విజ‌య్ వార‌సుడు వ‌స్తోంది. చిరు వాల్తేరు వీర‌య్య ఎప్పుడు వ‌స్తోంద‌న్న‌ది క్లారిటీ లేదు. ఏదేమైనా బాల‌య్య ఈ సినిమాతో త‌న‌కు క‌లిసొచ్చిన సంక్రాంతి సెంటిమెంట్‌తో రికార్డుల దుమ్ము దులప‌డం.. త‌న రికార్డుల లెక్క‌లు స‌రిచేయ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news