Moviesలిప్ లాక్ ల తో రెచ్చిపోయిన మంచు లక్ష్మి..హోమో సెక్సువల్ గా...

లిప్ లాక్ ల తో రెచ్చిపోయిన మంచు లక్ష్మి..హోమో సెక్సువల్ గా కేక పెట్టించేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక మంచి యాక్టర్స్ అనిపించుకోవాలంటే ఎలాంటి రోల్స్నైనా చేయగలగాలి. కేవలం హీరోయిన్ గానే మెప్పిస్తాను అంటే కుదరదు . కాగా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ వేసి అందరికి షాక్ ఇచ్చింది కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి . ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయవలసిన అవసరం లేదు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు లక్ష్మి ..మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రూవ్ చేసుకుంది.


సినిమాలో నటిస్తూనే ..సినిమాలు డైరెక్ట్ చేస్తూ ..ప్రొడ్యూస్ చేసి అన్ని విధాల తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. యాంకర్ గాను పలు షో లల్లో మెప్పించింది. కాగా రీసెంట్గా ఆమె మలయాళంలో నటించిన మోనాస్టర్ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం లెస్బియన్ క్యారెక్టర్ లో మంచు లక్ష్మి నటించడం షాకింగ్ గా అనిపించింది .అంతేకాదు ఈ సినిమాలో మంచు లక్ష్మి పర్ఫామెన్స్ చూసి ఎవ్వరైనా సరే వల్గారిటీగా ఆమెను ట్రోల్ చేయరు. ఆమెలో ఇంత మంచి నటి ఉందా..? ఇన్నాళ్లు మన తెలుగు ప్రజల గుర్తించలేకపోయారా..? అంటూ ప్రశంసలతో ముంచెత్తుతారు.

అంతలా తన పెర్ఫార్మన్స్ ని ఈ సినిమాలో చూపించింది. ఈ సినిమాలో మంచు లక్ష్మి హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలాంటి రోల్ ని యాక్సెప్ట్ చేయడంతోనే ఆమెటిగా సక్సెస్ అయింది అంటున్నారు జనాలు. ఇప్పటివరకు విలన్, హీరోయిన్ తరహా చేస్తూ వచ్చిన మంచు లక్ష్మి ..మానస్టర్ లో మాత్రం చాలా కొత్తగా కనిపించింది . మరీ ముఖ్యంగా ఆమె స్క్రీన్ స్పేస్ చాలా తక్కువే ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం తన నటనతో మంత్రముగ్ధులను చేసింది .

ఈ సినిమాలో తోటి కంటెస్టెంట్ హనీ రోజ్ జుతో ఆమె చేసిన లిప్ లాక్ సీన్స్ సోషల్ మీడియాలో హైలెట్ గా మారాయి . ఇలాంటి రోల్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి . దాని ఛాలెంజింగ్ గా తీసుకున్న మంచు లక్ష్మి నటిగా ఓ మెట్టు ఎక్కేసింది అంటూ మంచు ఫ్యాన్స్ ఆమెను ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా సరే మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news