Moviesగంటసేపు..తాడులతో కట్టేసి మరీ..ఆ నొప్పికి నరకం చూసిన పూర్ణ..!!

గంటసేపు..తాడులతో కట్టేసి మరీ..ఆ నొప్పికి నరకం చూసిన పూర్ణ..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగవు ..అనుకోనివి ఊహించిన విధంగా జరుగుతూ ఉంటాయి. అలాగే జరిగింది పూర్ణ లైఫ్ లో ..ఎవరు ఊహించని విధంగా డౌన్ అయిపోయిన తన కెరీర్ ని పికప్ చేసుకొని ..పీక్స్ కి మార్చుకున్న పూర్ణ ప్రజెంట్ పెళ్లి చేసుకుని భర్తతో మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కాక సీమటపాకాయ్ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ..రవిబాబు డైరెక్షన్లో ఎక్కువ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రవి బాబుకు ఆమెకు మధ్య ఇల్లీగల్ అఫైర్ ఉంది అంటూ చాలామంది చెప్పుకొచ్చారు.

మరీ ముఖ్యంగా అవును సిరీస్ హిట్ అవడంతో రవిబాబు పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అలాంటివన్నీ ఫేక్ అంటూ రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఆలీతో సరదాగా గేమ్ షోలో పాల్గొన్న రవిబాబు తన ఫిల్మీ అప్డేట్స్ అండ్ సీక్రెట్స్ పై పూర్తిగా ఓపెన్ అప్ అయిపోయాడు . ఈ క్రమంలోని హీరోయిన్ పూర్ణ విషయంలో జరిగిన తప్పును ఓపెన్ గా చెప్పేసాడు . ఆయన మాట్లాడుతూ..” పూర్ణ నా డైరెక్షన్లో సినిమాలు చేసినప్పటికీ మా మధ్య మీరు అనుకుంటున్న రిలేషన్షిప్ ఏమీ లేదు. డైరెక్టర్ – హీరోయిన్ రిలేషన్షిప్ . నేనే కాదు ఏ డైరెక్టర్ అయినా సరే ఓ హీరోయిన్ చీప్ రేట్ కి దొరుకుతుంది అంటే కచ్చితంగా మనం ఆమెను పెట్టుకుంటాం. నేను అదే చేశాను ”

“అయితే అవును సినిమా షూటింగ్లో పూర్ణ నావల్ల బాధపడింది . ఈ సినిమా కోసం ఏనుగులతో ఆమెను పట్టుకున్న పోస్టర్ కావాలని ఆ ఫోటో కోసం చాలా విధాలుగా ట్రై చేసాం. ఈ క్రమంలోనే పూర్ణా ను తాడులకు కట్టేసి గంటసేపు అలాగే వేలాడదీసం . అయితే కొద్దిసేపు అయిన తర్వాత కెమెరామెన్ చేసిన పొరపాటుతో అసలు విషయం బయటపడింది . కెమెరాలో చిప్ పెట్టడం మర్చిపోయాడని ఆ విషయం అక్కడ ఎవరికైనా చెప్తే గోల జరుగుతుంది అని ..మెల్లగా నాకు వచ్చి చెప్పాడు .

ఇదే విషయాన్ని నేను పూర్ణాకు చెప్పినప్పుడు ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది. కోపంతో ఊగిపోయింది . ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నాను . కానీ చేసేది ఏమీ లేక మళ్ళీ గంట సేపు తాడులు కట్టేసి ఆమెను వెలాడతీయాల్సి వచ్చింది . ఈ టైంలో పాపం ఆమె చాలా నొప్పిని భరించింది. కానీ తప్పదు సినిమా కోసం అంత భరించింది. కాగా ఫోటోగ్రాఫర్ చేసిన చిన్న తప్పుకి పూర్ణ చాలా బలైపోయింది ..బాధపడింది” అంటూ ఆ కార్యక్రమంలో రవిబాబు చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే పూర్ణ ప్రజెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది . అదే హ్యాపీ అంటూ చెప్పుకొస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news