Movies"ఆమె మన రేంజ్ కాదులే బ్రో"..అయ్య బాబోయ్ సత్య దేవ్ ఏంటి...

“ఆమె మన రేంజ్ కాదులే బ్రో”..అయ్య బాబోయ్ సత్య దేవ్ ఏంటి అంత మాట అనేశాడు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సత్యదేవ్. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రజెంట్ బిగ్ బిగ్ స్టార్స్ అందరి దగ్గర శభాష్ అనిపించుకుంటున్నాడు . అంత ఎందుకు మొన్నటికి మొన్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన టైంలో సల్మాన్ ఖాన్.. చిరంజీవి ..సైతం సత్యదేవ్ ని ఓ రేంజ్ లో పొగడేసారు . ఈ సినిమాలో నటించడం ఆయన అదృష్టంగా భావిస్తున్నట్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు .

కాగా రీసెంట్గా సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా గుర్తుందా సీతాకాలం . నాగ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమాలో హీరోగా సత్యదేవ్ నే ఉండాలి అని అడిగి కోరి మరీ పెట్టించుకుంది. తమన్నా నే ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పుకొచ్చింది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు ,

“ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో రిలీజ్ అవుతున్న లవ్ స్టోరీ అన్ని హిట్ అవుతున్నాయి . మా సినిమా కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను . ఈ సినిమాలో నాది ఓ డిఫరెంట్ క్యారెక్టర్ .కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. తెరపై తమన్నాతో స్క్రీన్ సేప్స్ చాలా అద్భుతంగా ఉంది . చిరంజీవి -చార్మి -తమన్న -నయనతార లాంటి పెద్ద వ్యక్తులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది . మొదట ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నాను అన్నప్పుడు నమ్మలేదు. తమన్నానే మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అని చాలామంది చెప్పారు. అయినా కూడా నమ్మలేదు .

ఆమె నా రేంజ్ కాదు కదా అని సైలెంట్ అయిపోయాను . అయితే తమన్నానే నాకు విషయం చెప్పడంతో షాకింగ్ అనిపించింది. అలాంటి పెద్ద వాళ్లతో వర్క్ చేయడం నిజంగానే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సత్యదేవ్ మాటల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉండాలి అని సత్యదేవ్ దగ్గర్నుంచి నేర్చుకోవాలి అంటూ ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సత్యదేవ్ ని పొగిడేస్తున్నారు . ఆయన మంచి మాటకారి కచ్చితంగా ఇండస్ట్రీలో మరి కొంతకాలం నెట్టుకొస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news