Moviesకృష్ణం రాజు కోసం.. ఇష్టం లేకుండానే ఆ హీరోయిన్ తో రొమాన్స్...

కృష్ణం రాజు కోసం.. ఇష్టం లేకుండానే ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన ప్రభాస్..ఎవరో తెలుసా..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కృష్ణంరాజు అలాంటి ఓ స్థానాన్ని కల్పించాడు. కాగా పెదనాన్న పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన రెబెల్ స్టార్ కూడా అదే రేంజ్ లో అభిమానులను సంపాదించుకుని ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ.. తన ఫాన్స్ కు కొత్త ఉత్సాహం ఇస్తున్నారు . కాగా రీసెంట్ గానే కృష్ణంరాజు అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే.

అయితే కృష్ణంరాజు కోసం ప్రభాస్ చేసిన పనులు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే ఆయన ఇష్టం లేకపోయినా సరే కృష్ణంరాజు చెప్పిన కారణంగా హీరోయిన్ తో చేసిన రొమాన్స్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రెబెల్ సినిమాలో హీరో ప్రభాస్ హీరోయిన్ దీక్ష సేధ్ చేసిన రొమాన్స్ అప్పట్లో హైలైట్ గా మారింది. అయితే ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారినా సరే కృష్ణంరాజుకు మాత్రం ఆ సినిమాలోని క్యారెక్టర్ బాగా నచ్చేసింది అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .

అయితే నిజానికి దీక్ష సెధ్ ప్లేస్ లో అనుష్క శెట్టిని అనుకున్నారట డైరెక్టర్ రాఘవ లారెన్స్ .. అయితే కృష్ణంరాజు ఆ పాత్రకి దీక్ష సేధ్ అయితే డీసెంట్ లుక్ ఉంటుందని.. ఫోర్స్ చేసి మరి ప్రభాస్ తో రొమాన్స్ చేయచ్చారట . ప్రభాస్ అసలు ఆ క్యారెక్టర్ కి ఆవిడ సెట్ అవ్వదు అని ముందే చెప్పినా కృష్ణంరాజు చెప్పాడు అన్న కారణంతోనే దీక్షా సేధ్ తో రొమాన్స్ చేసినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ప్రభాస్ అంచనాలు ఎప్పుడు తారు మారు అవ్వవు.. అనుకున్న విధంగానే ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఇలా పెదనాన్న పై ఉన్న ప్రేమను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news