Moviesఎవ్వరు ఊహించని ట్వీస్ట్..ఎలిమినేట్ అయినా ఫైమాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్...

ఎవ్వరు ఊహించని ట్వీస్ట్..ఎలిమినేట్ అయినా ఫైమాకి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్..!!

ఇది నిజంగా బిగ్ బాస్ అభిమానులకు చేదు వార్త అనే చెప్పాలి . హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తనదైనా స్టైల్ లో ఆడుతూ.. అలరిస్తూ ..ఎంజాయ్ చేస్తూ టాస్కుల్లో బీభత్సంగా ఎనర్జీ చూయించి టాప్ ప్లేస్ ను అందుకుంటుంది అనుకున్న ఫైమా బిగ్ బాస్ 13వ వారం ఎలిమినేట్ అయింది . నాగార్జున ఫైమ ఎలిమినేటెడ్ అని చెప్పగానే హౌస్ లోని కంటెస్టెంట్స్ కు గుండెఝల్లుమంది . టాప్ ఫైవ్లో కచ్చితంగా ఉంటది అనుకున్న ఫైమా.. ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ గా అనిపించింది.

అయితే గత కొన్ని వారాలుగా హౌస్ లో ఓవర్ యాక్టింగ్ ఎక్కువైందని.. కొందరిని టార్గెట్ చేస్తూ ఫైమ టాప్ లో ఉండడానికి మరింత కన్నింగ్ స్ట్రాటజీలని ఉపయోగించిందని ఈ క్రమంలోనే ఫాన్స్ సైతం అమ్మడుకు ఓట్లు వేయకుండా చేశారు అని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా కానీ బిగ్ బాస్ లో ఫైమ లేకపోయేసరికి..ఆ సందడే లేదు.

ఎలిమినేట్ అయిన తర్వాత ఫైమ తో..నాగార్జున చేసిన అల్లరి చాలా ముచ్చటగా అనిపించింది . మరి ముఖ్యంగా నాగార్జున ఫైమా చేతిపై ముద్దు పెట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఫైమా కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఎలిమినేట్ చేసి బాధపెట్టిన సరే బిగ్ బాస్ మాటీవీలో ఆమెకు కొత్త ఆఫర్ వచ్చేలా అగ్రిమెంట్ తయారు చేసుకున్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే ఫైమా మల్టీ టాలెంటెడ్. పంచ్ వేసిందంటే చాలు ఎలాంటి వాళ్ళైనా సరే కడుపునొప్పి వచ్చేంత విధంగా నవ్వాల్సిందే . అలా ఉంటుంది . ఇప్పటికే జబర్దస్త్ లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది . ఆమె స్కిట్స్ లేని కారణంగా జబర్దస్త్ టీఆర్పి రేటింగ్స్ సైతం తగ్గిపోయింది . ఇలాంటి టైంలోనే ఆమె కామెడీ పంచెస్ ని క్యాష్ చేసుకున్న మాటీవీ ఆమెతో సరికొత్త ప్రోగ్రాంను తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమీన సరే..బిగ్ బాస్ ద్వారా ఫైమ జాతకం మారిపోయిన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news