Moviesరష్మీ మాల్దీవ్స్ వెళ్లడం వెనుక.. ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

రష్మీ మాల్దీవ్స్ వెళ్లడం వెనుక.. ఇంత పెద్ద స్టోరీ ఉందా..?

బుల్లితెర యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన రష్మీ వెండితెరపై వచ్చిన అవకాశాలలో నటిస్తూనే బుల్లితెరపై తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఇప్పుడు బుల్లితెరపై టాప్ త్రీ యాంకర్స్ లో ఒకరిగా ఉంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది రష్మీ . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రష్మి చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి .

 

కాగా రీసెంట్గా బ్లాక్ బస్టర్ సినిమాతో పాజిటివ్ హిట్ అందుకున్న రష్మీ ..మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ ఆమె రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు గిలికగింతలు పెడుతుంది. అయితే రష్మీ ఎప్పుడూ లేనివిధంగా ఈ రేంజ్ లో ఫోటోషూట్ చేయడం పై సోషల్ మీడియాలో కొత్త చర్చలు నడుస్తున్నాయి. రష్మికి రెండు బడా ప్రాజెక్ట్స్ వచ్చాయని.. అవి కమిట్ అయితే రష్మి కొన్నాళ్లు తీరిక లేకుండా షూట్ చేయాల్సి వస్తుందని .. ఈ క్రమంలోనే రష్మీ రిలాక్స్ కోసం మాల్ దీవ్స్ వెళ్లిందని చెప్పుకొస్తున్నారు.

 

అంతేకాదు ఆమె త్వరలో చేయబోయే రెండు ప్రాజెక్ట్స్ కూడా మంచి మాస్ మసాలా ఎంటర్టైర్మెంట్ ఉంటుందని ..దీనికోసం తన బాడీ ఫిజిక్ ని సైతం మార్చుకోబోతుందని.. ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే రష్మి జబర్దస్త్ వదలదు అంటూ ఇదివరకే చెప్పుకొచ్చింది . చూడాలి మరి ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ రష్మీ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news