Moviesఇండస్ట్రీకి పట్టిన శని వదిలిపోతుంది..రష్మిక బ్యాన్‌ పై తమన్నా డైరక్టర్ సంచలన...

ఇండస్ట్రీకి పట్టిన శని వదిలిపోతుంది..రష్మిక బ్యాన్‌ పై తమన్నా డైరక్టర్ సంచలన కామెంట్స్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేరు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ తన సొంత గడ్డపైన బ్యాన్ చేయించుకునే విధంగా కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక మందన – రిషబ్ శెట్టి పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. కాంతారా సినిమా చూడకపోవడంతో ఈ తలనొప్పి స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.

అంతేకాదు కన్నడిగులు రష్మిక పై కోపంగా ఉన్నారని ..ఈ భామను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు . ఇదే క్రమంలో రష్మిక పై బ్యాన్ విధిస్తే పరిశ్రమకే నష్టం అంటూ డైరెక్టర్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. రష్మిక ను బ్యాన్ చేస్తే ఇండస్ట్రీకి పట్టిన శని వదిలిపోతుంది అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తమన్నాతో గుర్తుందా సీతాకాలం సినిమా చేస్తున్న నాగశేఖర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు .

ఆ ఇంటర్వ్యూలోనే రష్మిక వివాదం పై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు . “ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. నేను సంజీవ్ వెడ్స్ గీత అనే సినిమాను చేసాను. గతంలో నటించిన నటులు ఇప్పుడు చాలా స్టార్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ నన్ను గుర్తు పెట్టుకోవాలని అనుకోవట్లేదు . అదేవిధంగా రష్మిక ఏదో అన్నింది అని ఆమెను బ్యాన్ చేస్తే ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. ఆ ఇండస్ట్రీ కే ప్రాబ్లం . రష్మిక లో మంచి టాలెంట్ ఉంది . ఆమె మంచి యాక్టర్స్ . అలాంటి మంచి హీరోయిన్ ని బ్యాన్ చేస్తే ఆ ఇండస్ట్రీ చాలా నష్టపోతుంది “అంటూ సంచలన కామెంట్స్ చేశారు . అయితే దీనిపై సోషల్ మీడియాలో భిన్న విభిన్నమైన స్పందన లభిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news