Moviesపదే పదే అదే మాట ..ఫస్ట్ టైం కోపంతో ఊగిపోయిన సుమ...

పదే పదే అదే మాట ..ఫస్ట్ టైం కోపంతో ఊగిపోయిన సుమ ..వీడియో వైరల్..!!

బుల్లితెరపై యాంకర్ సుమకు ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలో కి వచ్చి చాలా కాలం అవుతున్నా ఇప్పటికి స్టార్ యాంకర్ గా కొనసాగుతూ వస్తుందంటే ..దానికి ముఖ్య కారణం ఆమె వేస్తే హెల్దీ పంచులు అనే చెప్పాలి. ఏ స్టార్ హీరో ఈవెంట్ అయినా.. ఫంక్షన్ అయినా సరే అక్కడ సుమ కచ్చితంగా ఉండాల్సిందే . అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్ అంటే పడి చచ్చిపోతారు .

అలాంటి ఓ క్రేజ్ ని సంపాదించుకుంది సుమ . దర్శకధీరుడు రాజమౌళి ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..నేచురల్ స్టార్ నాని ..సూపర్ స్టార్ మహేష్ బాబు ..ఇలా అందరూ యాంకరింగ్ కి ఫిదా అయినవారే . ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా చెప్పుకొచ్చారు ఈవెంట్స్ లో. కాగా రీసెంట్గా ఎప్పుడూ చలాకి గా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సుమ ఫస్ట్ టైం కోప్పడింది . ఆవేశంతో ఊగిపోయింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

యాంకర్ సుమ తన స్టాఫ్ ఎంత డెడికేషన్ తో వర్క్ చేస్తారో తెలియజేస్తూ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భాగంగా తన స్టాఫ్ అందరిని ఒక తోపు తోసేసి ఫ్రస్టేషన్ చూపించింది . నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ గట్టిగా అరిచేసింది. అయినప్పటికీ వాళ్ళు వదలకపోవడంతో నిరాశ పడింది . తమ విధులను నిర్వర్తిస్తూ స్టాఫ్ ఎంత కచ్చితంగా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో క్లియర్గా చూపించింది సుమ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

అంతేకాదు ఇలా చాలామంది డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారని ఆమె చెప్పకనే చెప్పేసింది . ప్రస్తుతం “లీవ్ మీ అలోన్ ” వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఏది ఏమైనా సరే సుమ క్రియేటివ్ మైండ్ ముందు ఎవరు పనికిరారు అని చెప్పాలి . ఈ విధంగా తమ రెగ్యులర్ లైఫ్ లో ఫేస్ చేసే కష్టాలను దానికోసం ఎదుటి వాళ్లు పడే పెయిన్స్ ని అన్ని క్లియర్ గా చూపించింది సుమ. దీంతో సుమ పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news