Moviesమింగలేక కక్కలేక మధ్యలో నలిగిపోతున్న రష్మిక మందన్న..తప్పదు తప్పించుకోవాలంటే మింగాల్సిందేనా..?

మింగలేక కక్కలేక మధ్యలో నలిగిపోతున్న రష్మిక మందన్న..తప్పదు తప్పించుకోవాలంటే మింగాల్సిందేనా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ మింగలేక కక్కలేక నలిగిపోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . కన్నడ ముద్దుగుమ్మ అయిన రష్మిక మందన ఛలో అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . అంతకుముందు కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా సినిమాలు చేసినా.. హిట్ అయినా ..కానీ అక్కడ రాని క్రేజ్ గుర్తింపు తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో ఆమెను ఏకంగా దేవతల చూశారు. మరి ముఖ్యంగా బిగ్ స్టార్స్ అందరూ అవకాశాలు ఇవ్వడంతో ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది .

ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుని.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి సూపర్ సక్సెస్ హీరోయిన్గా ట్యాగ్ చేయించుకుంది . కేవలం ఒకే ఒక్క సినిమా పుష్ప హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా ప్రాజెక్ట్స్ పట్టేసిన రష్మిక మందన ,,ప్రజెంట్ కన్నడ ఇండస్ట్రీలోని బ్యాన్ కు గురవబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే కన్నడ డైరెక్టర్ రిషిబ్ శెట్టితో రష్మిక మందన లొల్లి గురించి.. గత కొన్ని వారాలకు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వారాలు అవుతూనే ఉంది.

కాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ లో రష్మికను బ్యాన్ చేస్తూ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వబోతుందట. ఇదే విషయాన్ని ముందుగానే తెలుసుకున్న సుకుమార్ రిషబ్ శెట్టి కి సారీ చెప్పి ఆ గొడవ అక్కడితో తెంచుకోకపోతే.. పుష్ప 2 సినిమా నుంచి ఆమెను తప్పించే విధంగా ప్లాన్ చేసుకున్నారట. ఇదే విషయాన్ని రష్మికకు చెప్పాడట . అంతేకాదు నువ్వు తప్పు చేసిన చేయకపోయినా సరే ముందు అతనికి సారీ చెప్తే నీకే మంచిది . నీ కెరీర్ ఆగిపోకుండా ఉంటుంది అంటూ సజెషన్ ఇచ్చారట . ఈ క్రమంలోనే రష్మిక మందన్నా ఇష్టం లేకపోయినా సరే అతగాడికి సారీ చెప్పడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news