Moviesఆఖరి కోరిక తీరకుండానే మరణించిన సూపర్ స్టార్ కృష్ణ..ఇంతకంటే దారుణం మరోకటి...

ఆఖరి కోరిక తీరకుండానే మరణించిన సూపర్ స్టార్ కృష్ణ..ఇంతకంటే దారుణం మరోకటి ఉండదు..!!

టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న ఈయన ..ఆరోగ్యం మరింత క్షీణించడంతో..నిన్న తెల్లవారుజామున హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు . అయితే ఇలాంటి టైంలోనే హాట్ అటాక్ రావడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం.. గంటలు గడుస్తున్న కొద్ది ఆయన బాడికి వైద్యం సహకరించకపోవడంతో సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

దీంతో సూపర్ స్టార్ అభిమానులు కుప్పకూలిపోయారు . మహేష్ బాబుని కంట్రోల్ చేయడం ఎవరి తరం కావడం లేదు. కొన్ని నెలల ముందు మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరా దేవిని కోల్పోయారు.. మూడు నెలలు కాకముందే ఇలా నాన్నగారు కూడా మరణించడంతో మహేష్ బాబు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు తండ్రి మాటకు ఎదురు చెప్పడట. ఎంత పెద్ద హీరో అయినా సరే అమ్మ నాన్నలు చెప్పింది తూ చా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు.

అయితే ఒక విషయంలో మాత్రం మహేష్ బాబు అమ్మ నాన్న మాటలకు వ్యతిరేకించాడు. అది కూడా తన కూతురు సితార విషయంలో.. మహేష్ బాబు కూతురు సితార ఓణీల ఫంక్షన్ మరొక పది రోజుల్లో గ్రాండ్గా జరపాలని నిశ్చయించుకున్నారట . అది మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఆఖరి కోరిక ..ఆమె బ్రతికి ఉన్నప్పుడు చాలాసార్లు మహేష్ ని అడిగారట ..కానీ మహేష్ కు లాంటి ఫంక్షన్లు ఇష్టం లేకపోవడంతో రిజెక్ట్ చేశారట .

తల్లి ఆఖరి కోరిక కావడంతో ఆమె లేకపోయినా ఆమె కోరిక తీర్చడానికి ఫంక్షన్ చేయడానికి సిద్ధపడ్డారట మహేష్. ఈ క్రమంలోనే మనవరాలు జీవితంలో జరిగే మొదటి ముచ్చటను చూడడానికి సూపర్ స్టార్ కృష్ణ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారట. మనకు తెలిసిందే సూపర్ స్టార్ కృష్ణకు సితార పాప అంటే చాలా ఇష్టం, మహేష్ బాబు వాళ్ళ నానమ్మ గారు అని ..సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ అమ్మగారే సితార పాప అంటూ నమ్ముతారట. ఈ క్రమంలోనే సితార పాపను అందరికన్నా ఎక్కువగా చేరదీసే వాడట . అయితే ఫంక్షన్ చూస్తాము అని ఆశగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ మరింత బాధపడుతున్నారు . ఏది ఏమైనా సరే ఘట్టమనేని ఫ్యామిలీని ఏదో శని వెంటాడుతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news