Moviesసమంత చుట్టూ ఏం జ‌రుగుతోంది... ఆమెను ఇంత‌లా టార్గెట్ చేస్తున్నారెందుకు...!

సమంత చుట్టూ ఏం జ‌రుగుతోంది… ఆమెను ఇంత‌లా టార్గెట్ చేస్తున్నారెందుకు…!

సోషల్ మీడియాలో మళ్ళీ స్టార్ హీరోయిన్ సమంత హాట్ టాపిక్‌గా మారింది. బాగా ఆలోచిస్తే సమంత నటించిన మొదటిసినిమా నుంచే హాట్ టాపిక్ అని అర్థమవుతుంది. మొదటి సినిమా సమయంలో తను ఎక్కడి నుంచీ వచ్చిందో పెద్దగా ఎవరికీ తెలియదు. కేవలం 500 రూపాయలకోసం గంటలకొదీ నిల్చొని అథితులను ఆహ్వానించే ఉద్యోగం చేసిన సమంత ఇప్పుడు 5 కోట్ల హీరోయిన్. ఈ స్థాయి సమంత కూడా వస్తుందని ఊహించి ఉండదు.

ఇదంతా తన కష్టం మీదే ఆధారపడింది. అలాగే తనకి ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలు సపోర్ట్ చేశారు. మొదటి సినిమాలోనే అన్నీ ముద్దులున్నా పెట్టడానికి రెడీ అయిందంటే ఎంత కసి, ఎంత మొడితనమో అర్థం చేసుకోవచ్చు. అలా మొదటి సినిమా నుంచే సమంత అటు తమిళ ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. ఇక నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.

గత ఏడాది నుంచి ఒంటరిగా తన లైఫ్ ఏదో తను చూసుకుంటూ తన సినిమాలను చేసుకుంటూ వస్తోంది. అయితే, ఇటీవల సమంత కొన్నిరోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. దీనికి కారణాలు ఇవే అంటూ రక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ, ఇటీవల సమంత బాధపడుతున్న వ్యాధి గురించి వెల్లడించింది. అంతే, అప్పటి నుంచి తనకేదో భయంకరమైన జబ్బు సోకిందనే విధంగా ఫొటోలు పెట్టి పిచ్చి రాతలు రాస్తున్నారు.

దాంతో సమంత అభిమానులకి కిందనుంచీ మండుకొస్తోంది. మా సమంత భాగానే ఉందిరా బాబూ..ఆమెకేమీ కాలేదు. మీరు మరీ అంత జాలి చూపించాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సన్నిహితుల ద్వారా తెలుస్తున్నదాని ప్రకారం సమంత బాగానే ఉందట. తన ఆరోగ్యం కూడా కుదుటపడిందని తెలుస్తోంది. త్వరలోనే మళ్ళీ సమంత మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాబోతుందని సమాచారం. ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news