Moviesగీతూ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆయనేనా..? ఆ మాటను తీసుకోలేకపోయాడా..!?

గీతూ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆయనేనా..? ఆ మాటను తీసుకోలేకపోయాడా..!?

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ చెత్త టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. కంటెస్టెంట్లు ఈ షో ను డిజాస్టర్ గా మార్చేశారు. ఈ క్రమంలోనే హౌస్ లో తమకు నచ్చని కంటెస్టెంట్లను తక్కువ ఓట్లు వేసి బయటకు పంపిస్తున్నారు. కాగా ఎవరు ఊహించిన విధంగా బిగ్ బాస్ లో ఎనిమిదవ వారం గలాటా గీతూ ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ అనిపించింది.

నిజానికి ఈసారి కప్పు కొట్టే అర్హత ఉన్న లేడీ కంటెస్టెంట్ పైమ, గీతు అంటూ జనాలు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరే హౌస్ లో జన్యున్ గేమ్ ఆడుతున్నారని ..మిగతా వాళ్ళంతా మేకప్ వేసుకొని ముద్దులు పెట్టుకోవడానికి టైం సరిపోతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు గలాటా గీతూ ఫస్ట్ వారం నుంచి హౌస్ లో తన స్ట్రాటజీ ప్లాన్ చేస్తూ తనదైన స్టైల్ లో గేమ్స్ ఆడుతూ టాప్ ఫైవ్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంది. అయితే బిగ్ బాస్ ఓవర్ యాక్టింగ్ కి బలైపోయిన గలటా గీతూ.. ఎనిమిదో వారం..ఎవ్వరు ఊహించిన విధంగా ఎలిమినేట్ అయింది .

ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన గీతూ వీడియోలో.. లోపల జరిగిన బండారాలను బయటపెట్టింది. ” నిజానికి మీకు చూపించే ఎపిసోడ్ చాలా చిన్నదని అంతకు ట్రిపుల్ చేస్తారని ..నా ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా నాలుగు గంటలు జరిగిందని కానీ కేవలం మీకు అరగంట చూపించారని చెప్పుకొచ్చింది. నాగార్జున ఎంతో పొగడేసారని హౌస్ లో జెన్యూన్ గా గేమ్ ఆడిన వ్యక్తివి నువ్వే అంటూ అందరి ముందు చెప్పుకొచ్చారని చెప్పింది “.

అంతేకాదు ఇవే కామెంట్స్ ఆమె కొంప ముంచిన్నట్లు గీతూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. “నీ గేమ్ నువ్వు ఆడుతుంటే.. నిన్ను పొగడ్తల్లో ముంచేతి ..అడ్డదారులు తొక్కించి.. ఓవర్గా కామెడీ చేసే విధంగా మార్చేసారు. నీ ఎలిమినేషన్ కి పరోక్షంగా నాగార్జున ,బిగ్ బాస్ టీం సభ్యుల కారణం అంటూ వాళ్లపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజం హౌస్ నుంచి గీతు బయటకు వచ్చాక హౌస్ లో సందడే లేకుండా పోయింది ..అల్లరి చేసే వాళ్ళు లేరు అల్లరిని పట్టించుకునే జనాలు లేరు . చూద్దాం బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరు అవుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news