Moviesరావడం రావడమే పెంట పెంట చేసిన సుధీర్.. ఇలా చేస్తాడని అస్సలు...

రావడం రావడమే పెంట పెంట చేసిన సుధీర్.. ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు భయ్యా..!!

అమ్మ.. బాబోయ్ వాడు వచ్చేసాడు .. ఇక రచ్చ రచ్చ. ప్రజెంట్ అందరు ఇదే మాట అంటున్నారు. మనకు తెలిసిందే గత కొంతకాలంగా జబర్దస్త్ ప్రోగ్రామ్ కి స్టార్ కమెడియన్స్ దూరంగా ఉంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎవరు పాటికి వాళ్ళు జబర్దస్త్ ని ఓ రేంజ్ లో తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెళ్ళిపోయిన కమెడియన్స్ ని బ్యాక్ తీసుకొచ్చే పనిలో బిజీగా మారిపోయారు జబర్దస్త్ నిర్వాహకులు .

అయితే ఆ విషయం లో ఎట్టకేలకు ఫుల్ సక్సెస్ అయ్యారు. రీసెంట్గా సుధీర్ కూడా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు . దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది మల్లెమాల . కాగా ఈ ప్రోమోలో రావడం రావడమే సుధీర్ నానా రచ్చ చేశాడు . ఒకవైపు గాలోడు సినిమా ప్రమోషన్స్ ను వాడుకుంటూనే ..మరోవైపు రష్మీకి తనకి మధ్య ఏదో ఉంది అన్నట్లు క్రియేట్ చేసే విధంగా సీన్స్ క్రియేట్ వేశారు.

అంతేనా మధ్యలో వర్ష ని లాగుతూ ఆమెతో చేసిన ఓవర్ కామెడీ జనాలకి ఎబ్బెటుగా అనిపించింది . అంతేకాదు సుధీర్ పక్కన రష్మిని తప్పితే ఎవరిని ఊహించుకోలేమంటున్నారు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ . ఇలా సినిమా ప్రమోషన్స్ కోసం వర్ష ని అడ్డు పెట్టుకోవడం ఏమాత్రం బాగాలేదు అంటున్నారు . అయితే ఒకటి మాత్రం నిజం కల తప్పిపోయిన జబర్దస్త్ కి సుడిగాలి రాకతో మళ్లి కొత్త కళ వచ్చింది. సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇవ్వగానే షో మొత్తం కలకలాడిపోయింది . మరీ ముఖ్యంగా రష్మీ పేస్ చూస్తే ఎవరికైనా విషయం అర్థం అయిపోతుంది . కాగా ప్రోమో లాస్ట్ ఎండింగ్ టచ్ ఇస్తూ రొమాంటిక్ మూడ్లో కి మారిపోయి ..పలు రొమాంటిక్ స్టిల్స్ ఇవ్వడం.. ఉండిపోరాదే సాంగ్ కి డాన్స్ వేయడం హైలైట్ గా మారింది . సుధీర్ హౌస్ లోకి రావడం బాగానే ఉన్నా వర్ష తో చేసిన ఓవర్ రొమాన్స్ బాగోలేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news