Moviesఅసిన్ కూతురు లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ తెలిస్తే ..ఆశ్చర్యపోవాల్సిందే..!!

అసిన్ కూతురు లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ తెలిస్తే ..ఆశ్చర్యపోవాల్సిందే..!!

హాట్ బ్యూటీ అసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాస్ మహారాజ రవితేజ తో కలిసి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అంటూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . అంతేనా ఫస్ట్ సినిమాతోని క్లాస్ మాస్ ఆడియన్స్ మెప్పించి మల్టీ టాలెంట్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా హిట్ అవ్వడంతో అసిన్ ఖాతాలో బోలెడన్ని అవకాశాలు వచ్చి పడ్డాయి , ఈ క్రమంలోని ఆచితూచి నిర్ణయాలు తీసుకున్న అసిన్.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , నాగార్జున, వెంకతేష్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం అందుకుంది .

మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ నటించిన శివమణి ,గజినీ, ఘర్షణ లాంటి చిత్రాలు ఎలాంటి పాజిటివ్ టాక్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కోలీవుడ్ , టాలీవుడ్, హిందీలో పలు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ 2016లో రాహుల్ శర్మ ..బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమైంది . ఇక తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. కేవలం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది . సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అసిన్..రీసెంట్గా తన కూతురుకు సంబంధించిన ఓ పోస్ట్ ను షేర్ చేసింది.

దీంతో సెకండ్స్ లోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది . రీసెంట్గా ఈమె తన నాన్న రాహుల్ కు మేకప్ వేసింది . లిప్ స్టిక్ వేస్తూ..ఐ షేడ్స్ పెడుతూ నాన్నను ఒక బార్బీ డాల్ గా రెడీ చేసింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ ఫోటోలపై నెటిజన్స్ భిన్న విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. నాలుగేళ్ల నిండిన ఈ పాపకి మ్యూజిక్ పట్ల తనకున్న ఇంట్రెస్ట్ తో ఎలాంటి మ్యూజిక్స్ అయినా సరే పియానో ద్వారా అద్భుతంగా ప్లే చేస్తుందట . అంతేకాదు చిన్నతనంలోని హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉందట. మరీ ముఖ్యంగా నటనలో అమ్మను మించిపోయిన టాలెంట్ ఉంది . చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందో ..లేక చిన్నతనం నుండే చైల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news