Moviesబాలయ్యకే పోటి..సమంత కు అంత సీన్ ఉందా..?

బాలయ్యకే పోటి..సమంత కు అంత సీన్ ఉందా..?

ఎస్ ..ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ నటసింహం బాలయ్యకి బుల్లి పిట్ట సమంతా పోటీ ఇవ్వనుందా ..అంటూ నందమూరి అభిమానులు సమంతను చులకనగా చూస్తున్నారు . మనకు తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రిలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నందమూరి బాలయ్య ఓ రేంజ్ లో అభిమానుల్ని ఆకట్టుకుంటూ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు . హీరోగా సినిమాలు చేయడమే కాదు.. హోస్ట్ గా కూడా అన్ స్టాపబుల్ షో తో ఎవరు టచ్ చేయలేని పొజిషన్లో ఉన్నారు.

కాగా ప్రజెంట్ బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తన 107వ సినిమాను చేస్తున్నాడు. ఇది అయిపోగానే వెంటనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో 108వ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు . కాగా ఈ రెండు సినిమాలు అయిపోగానే మళ్లీ తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో మరో సినిమాకి పచ్చ జెండా ఊపడానికి సిద్ధంగా ఉన్నాడు బాలయ్య . ఇలా వరుస సినిమాలకి కమిట్ అవ్వకముందే భారీ రేంజ్ లో మార్కెట్ పెంచుకుంటున్న బాలయ్య కి స్టార్ హీరోయిన్ సమంత పోటీ ఇవ్వనుంది అని ఓ న్యూస్ ఫైనల్ గా మారింది .

మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ షో చేస్తున్న బాలయ్య ఓ రేంజ్ లో అభిమానులు ఆకట్టుకుంటున్నాడు. కాగా సమంత కూడా ఇప్పుడు ఆహా వారితో కలిసి మరో టాక్ షో కి హోస్టుగా చేయబోతుందట. ఇదివరకే ఆల్రెడీ సామ్ జామ్ అనే పేరుతో ఓ టాక్ షోను నిర్వహించింది. కానీ అది డిజాస్టర్ గా మారింది. అయితే ఇలాంటి క్రమంలోని బాలయ్య అన్ స్టాపబుల్ షో హీట్ అయిన క్రమంలో ఓన్లీ లేడీస్ స్పెషల్ అంటూ ఓ టాక్ షో ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట అల్లు అరవింద్ .

కాగా ఈ షో కి హోస్టుగా సమంత అయితే పబ్లిసిటీ ,పాపులారిటీ , క్రేజ్ అన్నీ వస్తాయి అని అల్లు అరవింద్ భావించారట .ఈ క్రమంలోని సమంత కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సరే బాలయ్యకే పోటీ ఇవ్వాలనుకున్న సమంత డేరింగ్ కి ఒక హాట్సాఫ్ చెప్పినా.. కనీసం బాలయ్య స్టామినాలో పావు వంతు కూడా లేని సమంత ఆ స్ధాయి ని రిచ్ అవ్వలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి చూద్దాం సమంత ప్రోగ్రాం ఏమైనా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news