Moviesవారెవ్వ: గాలోడికి గాల్లో ఎగిరే ఆఫర్ .. లక్ అంటే ఇదేగా..!?

వారెవ్వ: గాలోడికి గాల్లో ఎగిరే ఆఫర్ .. లక్ అంటే ఇదేగా..!?

ఇది నిజంగా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఒక చిన్న కమెడియన్ గా.. చిన్ని షోలో స్ధానం దక్కించుకొని ..తనదైన టాలెంట్ తో కంటెస్టెంట్గా ..ఆ తర్వాత టీం లీడర్ గా.. ఆ తర్వాత షో ని ఆయన స్కిట్స్ పై నడిపే అంత స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సుధీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇన్ని అవకాశాలు వచ్చినా మనలో టాలెంట్ లేకపోతే జనాలు ఆదరించరు .

అలాగే ఎలాంటి షోస్ చేసినా కానీ సుధీర్ లో టాలెంట్ లేకపోతే జనాలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయరు. ఆయనను ఇంతలా అభిమానించరు..ఇష్టపడరు. ఒక సాధారణమైన చిన్న కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టినా సుధీర్..ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయాడు. రీసెంట్గా సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన సినిమా గాల్లోడు. ఈ సినిమాకు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు . కానీ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ చూసి జనాలు షాక్ అయిపోతున్నారు .

ఇంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా సుడిగాలి సుధీర్ కి అంటూ ఆశ్చర్యపోతున్నారు . ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ క్రేజ్ ని పట్టేసుకున్న కొరటాల శివ.. ఏకంగా ఎన్టీఆర్ సినిమాల్లో ఓ కీలక పాత్రలో సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇది సుడిగాలి సుధీర్ర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇంత మంచి ఆఫర్ అందుకోవడం నార్మల్ విషయం కాదు. ఎన్టీఆర్ సినిమాలో కీలకపాత్ర అంటే మైండ్ బ్లాకింగ్ అనే చెప్పాలి. దీంతో సుధీర్ ఫ్యాన్స్ గాల్లో ఎగిరిపోతున్నారు. నిజంగా సుధీర్ లక్కీ ఫెలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news