Moviesఆ విషయంలో రాజమౌళి అంత తోపా..? ఢీ కొట్టే మగాడే లేడా..?

ఆ విషయంలో రాజమౌళి అంత తోపా..? ఢీ కొట్టే మగాడే లేడా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రాజమౌళి.. ప్రజెంట్ ఏ డైరెక్టర్ టచ్ చేయలేని టాప్ పొజిషన్లో ఉన్నాడు. సినిమాలో నటించే హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ .. ఇండస్ట్రీలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు . అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న రాజమౌళి .. ఆ సినిమాను జపాన్ లో సైతం విడుదల చేసి హ్యూజ్ కలెక్షన్స్ అందుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా రాజమౌళి పేరు.. ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనుల కోసం బిజీగా ఉన్నాడు . అంతేకాదు రీసెంట్గా రాజమౌళి అరుదైన గౌరవం అందుకున్నాడు. ఏ డైరెక్టర్ అందుకోలేని ఘనత రాజమౌళి అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కొందరు ఆయనను విమర్శిస్తున్నారు . మనకు తెలిసిందే రీసెంట్గా దర్శకుడు రాజమౌళి టాలెంట్ ని అందరికీ తెలియజేసేలా చేస్తూ.. యూఎస్ఏ లో లార్జెస్ట్ సర్కులేషన్ కలిగిన పేపర్స్ లో ఒకటైన “లాస్ ఏంజెల్స్ టైమ్స్” లో రాజమౌళి పై ఒక హ్యూజ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ని పబ్లిష్ చేసింది.

అది కూడా మొదటి పేజీలో బిగ్ పోస్టర్ తో పబ్లిష్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు లాస్ ఏంజెల్స్ టైమ్స్ ఏ సినిమా సెలబ్రెటీ గురించి ఈ విధంగా పబ్లిష్ చేయలేదు . ఆ ఘనత సాధించిన ఫస్ట్ తెలుగు డైరెక్టర్ రాజమౌళి కావడం ఇండియన్స్ గర్వపడే విషయం . అయితే రాజమౌళి ఈ ఘనత సాధించడంతో ఆయన ఫ్యాన్స్ సంబరపడుతుంటే .. మరి కొందరు ఆయనను విమర్శిస్తున్నారు. డైరెక్షన్లో రాజమౌళి ని ఢీ కొట్టే మగాడే లేడా..? మరి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. దాసరి నారాయణరావు.. వీళ్ళందరూ ఏమైపోవాలి..? వీళ్లకు మించిన డైరెక్షన్ రాజమౌళి లో ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news