Moviesయస్..పెళ్లికి ముందే అలా చేసా ..తప్పేంటి..శృతి హాసన్ దిమ్మతిరిగిపోయే ఆన్సర్..!!

యస్..పెళ్లికి ముందే అలా చేసా ..తప్పేంటి..శృతి హాసన్ దిమ్మతిరిగిపోయే ఆన్సర్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే ముద్దుగుమ్మలు వాళ్లు చేసిన చెత్త పనులను కూడా ధైర్యంగా చెప్పుకునే సాహసం చేస్తున్నారు . అది ఎలాంటి పనైనా సరే.. ఏ మాత్రం భయపడట్లేదు. నేను చేసింది కరెక్ట్.. నేను చేసింది రైట్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పుకుంటున్నారు. కాగా ఆ లిస్టులోకి యాడ్ అయిపోయింది స్టార్ట్ డాటర్ శృతిహాసన్. అమ్మడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కమల్ హాసన్ కూతురుగా సగం పాపులారిటీ సంపాదించుకున్న శృతి.. సినిమాలోకి వచ్చిన తర్వాత తన మల్టీ టాలెంట్ తో బోలెడంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో శృతిహాసన్ ఒక్క హిట్ కొట్టడానికి నానా తంటాలు పడింది. స్టార్ డాటర్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో శృతిహాసన్ వచ్చిన అవకాశాలతోనే తనని మెప్పించే విధంగా ట్రై చేసింది. అయితే మొదటిసారిగా శృతిహాసన్ హిట్ చూసింది మాత్రం గబ్బర్ సింగ్ సినిమాతోనే అని చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును కొల్లగొట్టింది . శృతి కెరీర్ ని మార్చేసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ చేసింది. ఈ సినిమా తర్వాత శృతిహాసన్ వరుస హిట్లతో దూసుకుపోయింది. అయితే తన ప్రేమ వ్యవహారాలు కారణంగా సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ తగ్గించేసింది. ఈ క్రమంలోనే శృతి కెరియర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది.

శృతి గతంలో మైఖేల్ కోర్స్ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత అతనితో విభేదాలు కారణంగా విడిపోయింది. ఇక ఆ తర్వాత సంతాను హజారిక అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రజెంట్ అతనితో డేటింగ్ చేస్తుంది. పబ్లిక్ గానే వీళ్లిద్దరు చేతిలో చేయి వేసుకొని.. చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియాకు దర్శనమిస్తూ ఉన్నారు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ ముక్కు అందరికీ విభిన్నంగా కనిపించింది.

దీంతో అందరు ఆమె ముక్కు పైన ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే మీ ముక్కు కు ఏమైనా అయిందా అంటే..” ఎస్ అవును నా ముక్కుకి సర్జరీ చేయించుకున్నాను.. దాని గురించి మీకు చెప్పాల్సిన పనిలేదు ..కొందరు అంటున్నారు పెళ్లికి ముందే బాడీ పార్ట్ కి సర్జరీ చేయించుకుంటున్నావు ఇబ్బంది అని.. ఆఫ్ కోర్స్ మన బాడీ పార్ట్స్ మనకు నచ్చినట్లు ఉండకపోతే సర్జరీ చేయించుకునే పూర్తి అధికారం మనకుంది ..దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు” అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ మేటర్ అలాగే శృతిహాసన్ ముక్కుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఏది ఏమైనా సరే శృతిహాసన్ ఇలా డేరింగ్ గా కామెంట్స్ చేయడం కొందరు జనాలకు నచ్చుతుంది. అయితే బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి ముందే ఇలా బయట తిరగడం మాత్రం కమలహాసన్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news