Moviesఓ మై గాడ్: హీరో నానికి ఘోర అవమానం..ఇంతకంటే దారుణం మరోకటి...

ఓ మై గాడ్: హీరో నానికి ఘోర అవమానం..ఇంతకంటే దారుణం మరోకటి ఉంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. ఇది ఓ మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఊసరవెల్లిలా రంగులు మార్చే గ్లామరస్ ప్రపంచం ..అంటూ జనాల చెప్పుకొస్తూ ఉంటారు. అదైతే నిజమే ఎందుకంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన హీరో సినిమా కి పరమ చెత్త టీఆర్పి రేటింగ్ రావడం అంటే మాటలా..? నిజమే ఆ హీరో అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది ఆ సినిమా. ఆ హీరో మరింత బాధపడిపోతున్నాడు. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

నాచురల్ స్టార్ నాని ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ కెరియర్ ని ప్రారంభించిన ఇతడు ఆ తర్వాత నటనపై ఉండే ఇంట్రెస్ట్ తో మెల్లగా సినిమా రంగంలోకి ప్రవేశించాడు .అష్టా చమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ..హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. తన సినీ కెరియర్ ని కొనసాగించాడు. కాగా ఒకానోక టైం లో హీరో నాని కు హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హిట్లు కొట్టుకుంటూ నేచురల్ యాక్టింగ్ తో అభిమానులను కట్టిపడేశారు. దీంతో స్టార్ హీరోల లిస్టులోకి వెళ్లిపోయాడు నాచురల్ స్టార్ నాని.

అయితే గత కొంతకాలంగా ఇతను టైం బాగోలేదు. ఇతను నటించిన లాస్ట్ ఆరు సినిమాలు చూస్తే ఒక్క “శ్యామ్ సింగరాయ్” సినిమా మాత్రమే హిట్ అయింది . మిగతా ఐదు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. అయితే రీసెంట్గా నటించిన అంటే సుందరానికి సినిమా మాత్ర నాని కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది. వెండితెరపై అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై కూడా దారుణంగా పడిపోయింది. రీసెంట్గా జెమినీ టీవీలో ప్రసారమైన అంటే సుందరానికి సినిమా పరమ చెత్త టీఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుని నాని కెరియర్ లోనే వరస్ట్ సినిమా గా నిలిచింది. దీంతో నాని అభిమానులు ఫీల్ అయిపోయారు. దీంతో ఈ మూవీ అతిపెద్ద అవమానాన్ని మూట కట్టుకునింది . ఓవరాల్ గా అంటే సుందరానికి అర్బన్, రూరల్ కలిపి యావరేజ్ గా 1.8 టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది. ఇది అసలు ఎవరు ఊహించని రేటింగ్ . నాని చిత్రాల్లో అత్యధికంగా టక్ జగదీశ్ 10.89 టీఆర్పీ రాబట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news