Moviesనందమూరి అభిమానులకి బ్లాస్టింగ్ అప్డేట్..హిట్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ ఫిక్స్..!!

నందమూరి అభిమానులకి బ్లాస్టింగ్ అప్డేట్..హిట్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ ఫిక్స్..!!

ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలయ్య ..ఓవైపు సినిమా షూటింగ్ ని.. మరోవైపు అన్ స్టాపబుల్ షూటింగ్ ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. కాగా మధ్యలో కొన్ని ఈవెంట్స్ కి మెయిన్ గెస్ట్ గా అటెండ్ అవుతూ ..తనదైన స్టైల్ లో అభిమానులను అలరిస్తున్నారు . అయితే వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే బాలకృష్ణ కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మరో సినిమా రెడీగా పెట్టుకుని ఉన్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం.. జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూట్ అఫీషియల్ గా ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ..బాలకృష్ణ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే రీసెంట్గా బాలయ్య నెక్స్ట్ సినిమాకు సంబంధించిన హింట్ ఇచ్చేసాడు. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన “ఊర్వశివో రాక్షసివో” ఈవెంట్లో బాలయ్య మెయిన్ గెస్ట్ గా అలరించారు .

డైరెక్టర్ పరశురాం కూడా తనదైన స్టైల్ లో మెప్పించారు. కాగా స్టేజీ పై పరశురాం మాట్లాడుతూ “త్వరలోనే అదిరిపోయే కథతో బాలయ్య ఇంటికి వెళ్తాను “అంటూ చెప్పుకొచ్చారు . దీంతో ఒక్కసారిగా బాలయ్య నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పరశురాం కథ చెప్తే రిజెక్ట్ చేసే హీరోస్ చాలా తక్కువ .. కంటెంట్ ఉంటే బాలయ్య ఎప్పుడు వెనకడుగు వేయరు . ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కాంబోలో సినిమా కన్ఫామ్ అవుతుందని.. అనిల్ రావిపూడి సినిమా అవ్వగానే ఈ సినిమా మొదలు పెడతారని జనాలు చర్చించుకుంటున్నారు . చూడాలి మరి నందమూరి ఫ్యాన్స్ ను పరశురాం ఏ విధంగా మెప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news