Moviesమ‌హేష్‌బాబు సినిమాల్లో భార్య న‌మ్ర‌త‌కు ఇష్ట‌మైన సినిమా ఇదే..!

మ‌హేష్‌బాబు సినిమాల్లో భార్య న‌మ్ర‌త‌కు ఇష్ట‌మైన సినిమా ఇదే..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు రీసెంట్‌గా స‌మ్మ‌ర్‌లో స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ప‌ర్వాలేద‌నిపించుకుంది. ప్ర‌స్తుతం మ‌హేష్‌.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ వెంట‌నే మ‌హేష్‌..రాజ‌మౌళి సినిమా స్టార్ట్ అవుతుంది. ఇలా వ‌రుస‌గా మ‌హేష్ రెండు క్రేజీ ప్రాజెక్టుల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

మ‌హేష్ కెరీర్ ప‌రంగా ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడ‌నే చెప్పాలి. భరత్ అనే నేను – మహర్షి – సరిలేరు నీకెవ్వరు – సర్కారు వారి పాట సినిమాలు క‌మర్షియ‌ల్‌గా బాగా స‌క్సెస్ అయ్యాయి. ఇక మ‌హేష్ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ఫ్యామిలీకి చాలా బాగా టైం కేటాయిస్తాడు. భార్య న‌మ్ర‌త‌తో పాటు కుమారుడు గౌత‌మ్‌, కూతురు సితార‌తో క‌లిసి విదేశాల‌కు వెకేష‌న్లకు చెక్కేస్తూ ఉంటాడు.

హైద‌రాబాద్‌లో ఉన్న‌ప్పుడు ఏ మాత్రం టైప్ ఉన్నా కూడా ఫ్యామిలీకి బాగా టైం కేటాయిస్తాడు. ఒక్కోసారి అయితే ఫ్యామిలీతో సినిమాల‌కు వెళితే హైద‌రాబాద్‌లో ఇబ్బంది అవుతుంద‌నుకున్న‌ప్పుడు ఫ్యామిలీతో ముంబై లేదా బెంగ‌ళూరు వెళ్లి మ‌రీ సినిమాలు చూసి వ‌స్తాడు. ఇక మ‌హేష్ సినిమాల విష‌యంలో న‌మ్ర‌త కూడా ఇటీవ‌ల చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

మ‌హేష్ కాస్ట్యూమ్స్‌, లుక్స్ విష‌యంలో న‌మ్ర‌త ఇన్వాల్‌మెంట్ వ‌చ్చాకే మ‌హేష్ మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాడు. అయితే మ‌హేష్ న‌టించిన అన్ని సినిమాల కంటే ఓ సినిమా అంటే న‌మ్ర‌త‌కు చాలా ఇష్టం అట‌.. ఆ సినిమా ఏదో కాదు పోకిరి.2006 ఏప్రిల్లో వ‌చ్చిన పోకిరి అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఉన్న చాలా రికార్డుల‌ను తిర‌గ‌రాసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

మ‌హేష్‌, కృష్ణ‌ల‌లో ఎవ‌రి న‌ట‌న అంటే మీకు ఇష్టం అన్న ప్ర‌శ్న‌కు న‌మ్ర‌త ఆన్స‌ర్ ఇస్తూ ఇద్ద‌రిని కంపేరిజ‌న్ చేయ‌లేమ‌ని.. ఎవ‌రి స్టైల్ వారిద‌ని.. త‌న‌కు ఇద్ద‌రూ ఇష్ట‌మే అని చెప్పింది. ఇక హైద‌రాబాద్‌, ముంబై రెండు సిటీలు అంటే త‌న‌కు ఇష్టం అని… మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌గా ఉండేందుకు తాను ఎంతో ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news