Moviesపీడకలలా మీరా జాస్మిన్ పెళ్లి వేడుక.. క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ..!

పీడకలలా మీరా జాస్మిన్ పెళ్లి వేడుక.. క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ..!

మీరా జాస్మిన్…తమిళ, మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె దాదాపుగా తన కెరియర్ లో మంచి అవార్డు విన్నింగ్ సినిమాలతో పాటు అనేక కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారింది. హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సత్తా చాటిన మీరా జాస్మిన్ తనతో నటించిన హీరోలతో లింకుల కారణంగా బాగా పాపులర్ అయింది. సినిమాల విషయం ఎలా ఉన్నా ఆమె వ్యక్తిగత జీవితం కూడా అనేక వివాదాలకు కారణమైంది. దుబాయ్ లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్న మీరా జాస్మిన్ తన పెళ్లి రోజు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

2013లో మీరాజాస్మిన్ పెళ్లి గురించి అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. చివరికి 2014 ఫిబ్రవరిలో ఆమె పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. మొదట్లో వీటికి సంబందించిన విషయాలు బయటకు రాకపోయినా మీరా జాస్మిన్ ది ప్రేమ వివాహం కాదు. ఆమెది పెద్దలు గురించిన వివాహమే. అనిల్ జాన్ అనే దుబాయ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తో కేరళలో ఆమె కుటుంబ సమక్షంలో పెళ్లి చేయాలని అంతా నిర్ణయించుకున్నారు.

ఎప్పుడైతే మీరా జాస్మిన్ కి పెళ్లి చేయాలని తన కుటుంబ నిర్ణయించుకుందో సరైన వరుడు కోసం చాలా రోజుల పాటు వెతికారు. ఇక అన్ని అనుకున్నట్టుగానే అనిల్ తో పెళ్లి కుదిరింది. 12, ఫిబ్రవరి 2014న తిరుప‌నంతపురంలోని పలాయం ఎల్ఎంఎస్ చర్చ్ లో పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేశారు. ఆమె వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులందరికీ కూడా ఇన్విటేషన్స్ పంచారు. చాలామంది సెలబ్రిటీస్ ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే మీరా జాస్మిన్, అనిల్ పెళ్లి తిరువనంతపురంలో ఒక కాంట్రవర్సీ అయింది.

మండపంలో వందల కొద్ది పోలీసులు ఉండడాన్ని చూసి అక్కడ పెళ్ళికి వచ్చిన వారంతా కూడా కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం కాలేదు. మీరా జాస్మిన్ సెలబ్రిటీ కాబట్టి వారంతా అక్కడికి వచ్చారేమో అని తొలుత భావించారు. పైగా పెళ్లికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉండడంతో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా పోలీసులను మోహరించాల్సి వచ్చింది.. అయితే అంత అనుకున్నట్టుగా మీరే జాస్మిన్‌కి ఫిబ్రవరి 12వ తేదీన పెళ్లి కాలేదు. ఆమెకు నిజంగా అదొక పీడకల‌.

ఆ తర్వాత రెండు నెలలకి ఆమె పెళ్లి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జ‌రిగి.. అఫీషియల్ గా అనిల్, మీరా భార్యాభర్తలయ్యారు. ఫిబ్రవరి 12న పెళ్లి జరగకపోవడానికి గల ముఖ్య కారణం ఆ తర్వాతే బయటపడింది. అనిల్ జాన్సన్ మొదట కేరళలోని వేరే ఒక అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. సరిగ్గా పెళ్లి సమయానికి మీరా జాస్మిన్ సంబంధం రావడంతో ఆ పెళ్లిని కాన్సల్ చేసుకొని మీరాతో పెళ్లికి రెడీ అయ్యాడు. ఆ విషయం తెలిసిన సదరు అమ్మాయి కుటుంబ సభ్యులు అనిల్ ని బెదిరింపులకు గురి చేశారు.

దాంతో భయపడి అంతగా పోలీస్ ఫోర్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు మీరా, అనిల్ దంపతులు. అయితే ఆ రోజు రిజిస్ట్రేషన్ కావాల్సిన పెళ్లి జరగపోవడానికి గల మరో కారణం పెళ్లికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ సరిగా సబ్మిట్ చేయకపోవడమే. కానీ ఈలోపే అనిల్ కు అంతకు ముందే వివాహం జరిగి ఆ విడాకుల పత్రం జోడించని కారణంగానే వారి వివాహం జరగలేదని మీడియా కోడై కూసింది. రెండు నెలల తర్వాత సరైన పత్రాలు అందించి వారి వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు మీరా జాస్మిన్ దంపతులు. ఇలా మీరా జాస్మిన్ పెళ్లి ఆమెకు పీడకల గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news