Moviesకీర్తి సురేష్ పెళ్లి మాట నిజమే.. వరుడు దొరికేసాడు..తల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!?

కీర్తి సురేష్ పెళ్లి మాట నిజమే.. వరుడు దొరికేసాడు..తల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!?

సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి బాజా మోగనుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే చాలామంది స్టార్స్ తాము ప్రేమించిన అమ్మాయిలను అబ్బాయిలను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. అంతేకాదు పెళ్లి చేసుకున్న వెంటనే గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి డబ్బులు సర్ప్రైజ్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే త్వరలోనే మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలేకబోతున్నట్లు తెలుస్తుంది . ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో కాదు మహానటి కీర్తి సురేష్.

చూడటానికి కుందనపు బొమ్మలా ఉండే కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏ రోల్ చేసిన ఆరోల్ కి తగ్గట్టు అందులో లీనం అయిపోతుంది . అది ట్రెడిషనల్ అయినా మోడ్రన్ పాత్ర అయినా అచ్చు గుద్దినట్లు ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ పుట్టిందా అన్న విధంగా యాడ్ చేస్తుంది . అందుకే కీర్తి సురేష్ కు తెలుగులో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం తెలుగులోనే కాదు తమిల్ లో కూడా కీర్తి సురేష్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అక్కడ కీర్తి సురేష్ పేరు చెప్పితే జనాలు పూనకాలతో ఊగిపోతారు .

అయితే కీర్తి సురేష్ కి ఇంతటి పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం మహానటి. ఈ ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆమె ఖాతాలో బోలెడన్ని సినిమాలు పెట్టాయి. నిజానికి కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో లిమిట్స్ దాటితో హాట్ పర్ఫామెన్స్ లు ఇస్తుంది. కాగా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి వార్త వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ కి పెళ్లి ఫిక్స్ అయిందని,, వరుడు కూడా దొరికేసాడని త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందని ఆ న్యూస్ బట్టి తెలుస్తుంది.

ఈ క్రమంలోని కీర్తి సురేష్ అమ్మగారు మేనక కోలీవుడ్ మీడియాకు అసలు విషయం చెప్పినట్లు తెలుస్తుంది. నిజానికి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మగారు రెండు సంవత్సరాల నుంచి బలవంతం చేస్తున్నారట . అయితే కీర్తి లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ దాటేస్తుందట .”నిజానికి కీర్తి సురేష్ కి వరుడు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడని మా బంధువుల అబ్బాయితోనే కీర్తి సురేష్ పెళ్లి జరుగుతుందని.. కీర్తి ఈరోజు యస్ అంటే రేపే పెళ్లి చేస్తామని..” ఆమె చెప్పినట్లు కోలీవుడ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది మరి చూడాలి కీర్తి సురేష్ తన మ్యారేజ్ న్యూస్ ఎప్పుడు అఫీషియల్ గా చెప్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news