Moviesఇండస్ట్రీలో జిమ్ కి వెళ్లని ఒక్కే ఒక్క హీరోయిన్ ఈమె.. ఫిట్...

ఇండస్ట్రీలో జిమ్ కి వెళ్లని ఒక్కే ఒక్క హీరోయిన్ ఈమె.. ఫిట్ నెస్ కోసం వెరైటీ పని..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు అందరూ తమ ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి జిమ్ లకి వెళ్లి గంటలు గంటలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం స్టార్ హీరోయిన్స్ నే కాదు డబ్బున్న బిగ్ బడా స్టార్స్ పిల్లలు అందరు కూడా తమ బాడీని కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి గంటలు తరబడి జిమ్ లల్లో వర్కౌట్ చేస్తున్నారు . అంతే కాదు దానికి తగ్గట్టు సపరేట్ డైట్ ను ఫాలో అవుతున్నారు.

వాటర్ డైట్ అని.. ప్లాంట్ బేస్డ్ డైట్ అని ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అని.. ఇలా కొత్త కొత్త రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఎటువంటి డైట్ ను ఫాలో అవ్వదట . ఆమె మూడు పూటలా భోజనం చేస్తుందట . అంతేకాదు ఇప్పటివరకు సాయి పల్లవి జిమ్ ముఖం చూసిందే లేదట . అయినా కానీ తన బాడీని కరెక్ట్ గా ఫిజిక్ లో పెట్టుకోవడానికి హెల్తీగా ఉండడానికి కారణం.. సాయి పల్లవి ఇంట్లోనే పనులు చేస్తూ తన బాడీని కంట్రోల్లో పెట్టుకుంటుందట.

ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాదు సాయి పల్లవి హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె నిజాయితీ . ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ప్రాణం పెట్టి నతిస్తుంది. తనకి నచ్చకపోతే ఆ క్యారెక్టర్ నటించదు . అందుకే ఆమె సినిమాలు ఫెయిల్ అయిన సరే ఆమె ఏ రోజు బాధపడదు.. ఎందుకంటే ఇష్టంగా ఆ పాత్రలో నటిస్తుంది.

కాగా సాయి పల్లవి సినిమాల విషయంలోనే కాదు వ్యక్తిగత జీవితంలోను అలాగే బీహేవ్ చేస్తుందట. నచ్చిన పని చేయదట అందుకే తనకి జిమ్ కి వెళ్లడం ఇష్టం లేదట. ఈ కారణంగానే ఇంట్లోనే తన బాడీని మెయింటైన్ చేయడానికి ..ఇల్లు చిమ్ముతుందట.. బట్టలు ఉతుక్కుంటుందట ..సూర్య నమస్కారాలు చేస్తుందట.. అంతేకాదు ఎలాంటి డైట్ ఫాలో అవ్వదట. మార్నింగ్ రాగి జావా , రెండు ఇడ్లి.. మధ్యహ్నం రసం అన్నం ఒక వెజిటేబుల్స్ ఫ్రై.. ఈవినింగ్ రెండు చపాతి ..అంతే ఇలానే తన ఫుడ్ డైట్ ను ఫాలో చేస్తుందట. అంతేకాదు సాయి పల్లవికి ఎక్కువగా స్వీట్లు అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా స్వీట్లు కనిపిస్తే మాత్రం ఫుల్ కుమ్మేస్తుందట. కానీ అందుకు తగ్గట్లు ఇంట్లో ఆరోజు ఎక్కువ పని చేస్తుందట. అంతేకానీ జిమ్ కి వెళ్లడం ఇంట్లో కష్టపడకుండా అక్కడికి వెళ్లి కష్టపడి చమటలు కార్చుకోవడం.. సాయి పల్లవికి తెలియదట. ఏది ఏమైనా సాయి పల్లవి రూట్ ఏ వేరు ..ఇలాంటి హీరోయిన్ కదా ఇండస్ట్రీ కావాలి అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news