Moviesనాగార్జున‌తో న‌టించిన ఈ హీరోయిన్ల‌కు ఇంత ఏజ్ గ్యాప్ ఉందా... షాక్...

నాగార్జున‌తో న‌టించిన ఈ హీరోయిన్ల‌కు ఇంత ఏజ్ గ్యాప్ ఉందా… షాక్ అవ్వాల్సిందేగా…!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు 60 – 70 సంవత్సరాలు వచ్చిన సూపర్‌స్టార్లుగా కొనసాగుతూనే ఉంటారు. వారి ఫాలోయింగ్ అలాంటిది. టాలీవుడ్ లో చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ ఏకంగా 40 సంవత్సరాలపాటు హీరోలుగా కొనసాగుతూనే వస్తున్నారు. ఎంత గొప్ప హీరోయిన్ అయినా పది సంవత్సరాలు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉంటే చాలా గొప్ప విషయం. హీరోయిన్ల‌కు మహా అయితే ఐదారు సంవత్సరాల లైఫ్‌ టైం మాత్రమే ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా నయనతార లాంటి హీరోయిన్లు 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు.

హీరోలు 60 – 70 సంవత్సరాలు వ‌చ్చినా ఇంకా నటిస్తూ ఉండడంతో వాళ్లకు జోడీగా హీరోయిన్లను సెట్ చేయటం దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారుతుంది. దీంతో ముసలి హీరోయిన్ల పక్కన అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ హీరోయిన్లు కూడా నటించాల్సి వస్తోంది. 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్న హీరోల పక్కన కూడా కుర్ర హీరోయిన్లు జోడిగా నటిస్తూ ఉండటం ఒక్కోసారి చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు మన్మధుడుగా పేరున్న కింగ్ నాగార్జున వయసు ఇప్పటికే 60 ఏళ్లు దాటిపోయింది.

నాగార్జునకు గత కొంతకాలంగా సోలోగా హిట్ లేదు. దీంతో దసరా కానుకగా ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సైతం సినిమాపై కాస్త కూస్తో అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక నాగర్జున తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించాడు. అందులో కొందరు హీరోయిన్లకు… నాగార్జునకు మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి హీరోయిన్లు ఎవరో చూద్దాం.

నాగార్జున – సోనాల్ చౌహాన్ :
నాగార్జునకు జోడిగా ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. సీనియర్ హీరో బాలయ్యతో ఏకంగా మూడు సినిమాల్లో జోడి కట్టింది. లెజెండ్ – డిక్టేటర్ -రూలర్ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు నాగార్జున పక్కన రొమాన్స్ చేస్తుంది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 28 సంవత్సరాలు.
నాగార్జున – లావ‌ణ్య త్రిపాఠి :
సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్ హిట్ సినిమాలో నాగార్జునకు పర్ఫెక్ట్ జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది. లావణ్య – నాగార్జున మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 32 సంవత్సరాలు ఉంది.

నాగార్జున – శ్రీయ‌ :
నేనున్నాను – మనం సినిమాల్లో నాగార్జున – శ్రేయ జోడిగా నటించారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 23 సంవత్సరాలు ఉండటం విశేషం.
నాగార్జున – త్రిష :
నాగార్జున కెరీర్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమాలో త్రిష హీరోయిన్. వీరి మ‌ధ్య‌ 24 సంవత్సరాల ఏజ్ గ్యాప్‌ ఉంది.


నాగార్జున – ఆకాంక్ష సింగ్‌:
దేవదాసు సినిమాలో నాగార్జునకి జోడిగా నటించింది ఆకాంక్ష సింగ్. వీరి మధ్య 32 సంవత్సరాల గ్యాప్ ఉంది.

నాగార్జున – ప్ర‌గ్య జైశ్వాల్ :
బాలయ్య అఖండలో నటించిన ప్రగ్యా నాగార్జున సరసన ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటించింది. నాగార్జున కంటే ప్రగ్య‌ ఏకంగా 30 సంవత్సరాలు చిన్నది.


నాగార్జున – న‌య‌న‌తార :
సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా ఉంటున్న నయనతార నాగార్జున సరసన బాస్ – గ్రీకువీరుడు సినిమాల‌లో నటించింది. వీరిద్దరి మధ్య కూడా 23 సంవత్సరాలు పైగా ఏజ్ గ్యాప్‌ ఉంది.

నాగార్జున – అనుష్క :
ఇక నాగార్జునకు బాగా లక్కీ హీరోయిన్ అయిన అనుష్క నాగార్జునతో చాలా సినిమాల్లో నటించింది. వీరిద్దరి మధ్య 23 సంవత్సరాల తేడా ఉంది.


అలాగే రగడలో నాగార్జున పక్కన నటించిన ప్రియమణి నాగార్జున కంటే 20 సంవత్సరాలు చిన్నది. భాయ్ సినిమాలో నటించిన రీచా గంగోపాధ్యాయ 27 సంవత్సరాలు – మాస్ సినిమాలో నటించిన ఛార్మి 23 సంవత్సరాలు – మన్మధుడు 2 లో నాగార్జున లిప్ కిస్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ 32 సంవత్సరాలు మన కింగ్ కంటే చిన్నవాళ్లు. అలా తనకంటే చాలా చిన్న హీరోయిన్లతో నాగార్జున రొమాన్స్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news