Movies' గాడ్ ఫాద‌ర్ ' టైటిల్ సాంగ్‌లో ఈ 3 మిస్టేక్‌లు...

‘ గాడ్ ఫాద‌ర్ ‘ టైటిల్ సాంగ్‌లో ఈ 3 మిస్టేక్‌లు చూశారా… పెద్ద దెబ్బ‌డిపోయిందిగా..!

మెగాస్టార్ న‌టించిన లూసీఫ‌ర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రి కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే ఉంది. ఎందుకో గాని ఆచార్య సినిమాకు ముందు ఎలా అయితే పెద్ద‌గా బ‌జ్ లేదో ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ విష‌యంలోనూ అలాగే ఉంది. పైగా ఈ సినిమా మ‌ళ‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, లుక్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు కూడా సినిమాపై ఏ మంత ఆస‌క్తి పెంచ‌లేక‌పోయాయి.

ఇప్ప‌టికే చాలా మంది లూసీఫ‌ర్‌ను కూడా చూసేశారు. ఇంకా ఏం కొత్త‌గా ఉంటుంది అని పెద‌వి విరుస్తోన్న వాళ్లు కూడా ఉన్నారు. మోహ‌న‌రాజా డైరెక్ష‌న్‌పై కూడా మ్యాజిక్ జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కాలు ఎవ్వ‌రికి లేవు. స‌ల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్ అన్నా… స్పెష‌ల్ సాంగ్ అప్పీరియెన్స్ ఉంద‌ని చెప్పినా కూడా బ‌జ్ పెర‌గ‌లేదు. పైగా ఈ సాంగ్‌ను రోలింగ్ టైటిల్స్‌కు మార్చేశామ‌ని ముందే చెప్ప‌డం సినిమాకు మ‌రింత మైన‌స్ అయ్యింది.

ఇక తాజాగా వ‌చ్చిన టైటిల్ సాంగ్ చూసిన వాళ్ల‌కు మైండ్ పోయినంత ప‌నైంది. ఈ సాంగ్‌లో స‌ల్మాన్ కూడా ఉండ‌డంతో పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంద‌నుకుంటే నెగటివ్ కామెంట్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ సాంగ్‌లో కొన్ని లోపాల‌ను కూడా నెటిజ‌న్లు, సినీ విశ్లేష‌కులు ఎత్తి చూపుతున్నారు. ఈ టైటిల్ సాంగ్‌లో మ్యూజిక్ ఏ మాత్రం ఆస‌క్తిగా లేద‌నే ఎక్కువ మంది అంటున్నారు. ఇది నిజం కూడా..!

ఇక లిరిక్స్ చూసిన వాళ్లు కూడా పెద‌వి విరుస్తున్నారు. ఇవేం లిరిక్స్ బాబోయ్ అని త‌ల‌లు బాదుకుంటున్నారు. అస‌లు ఇది చిరంజీవి రేంజ్ పాటే కాద‌ని చాలా మంది చెపుతున్నారు. ఇక ఈ సాంగ్ రోలింగ్ టైటిల్స్‌లో వ‌స్తుంద‌ని ముందే చెప్ప‌డం కూడా మ‌రో మైన‌స్ పాయింట్‌గా చెపుతున్నారు. ఏదేమైనా గాడ్ ఫాద‌ర్ అంచ‌నాల‌ను మించి పెర్పామ్ చేస్తేనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టెక్కేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news