Moviesస్టార్ హీరోని పెళ్ళి చేసుకోవాల్సిన మంచు లక్ష్మి.. ఇలా అయ్యిపోవడానికి కారణం...

స్టార్ హీరోని పెళ్ళి చేసుకోవాల్సిన మంచు లక్ష్మి.. ఇలా అయ్యిపోవడానికి కారణం అదేనా..!?

జీవితం ఎప్పుడూ మనం అనుకున్నంత సాఫీగా సాగిపోదు. అప్పుడప్పుడు మనం అనుకున్న వాటికి భిన్నంగా జరుగుతూ ఉంటాయి. అలాగే జరిగింది టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి విషయంలో. ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మంచు విష్ణు అక్కగారు మంచు లక్ష్మి స్టార్ హీరో భార్యగా ఇండస్ట్రీలో చలామణి అవ్వాల్సిందట. కానీ ఆమెకు చదువుల పైన ఉన్న ఇంట్రెస్ట్ కారణంగానే ఆ హీరోతో పెళ్లికి నో చెప్పి ఆ తర్వాత కొంతకాలానికి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అంటూ ఇండస్ట్రీలో న్యూస్ హల్చల్ చేస్తుంది . పూర్తి వివరాల్లోకి వెళ్లితే…!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకు ముగ్గురు బిడ్డలు.. పెద్ద బిడ్డ మంచు లక్ష్మి ..రెండో బిడ్డ మంచు విష్ణు.. మూడో బిడ్డ మంచు మనోజ్. ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలో తమ లక్ ను పరీక్షించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాగా మంచు లక్ష్మి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. విలన్ గాను ఆర్టిస్ట్ గాను అభిమానులను మెప్పించింది. అంతేకాదు మంచు లక్ష్మి సినిమాలు చేసి మెప్పించడం కన్నా కూడా తనదైన స్టైల్ లో ఇంగ్లీష్ మాట్లాడుతూ హోస్టుగా కూడా జనాలకు దగ్గర అయింది .

అయితే మంచు లక్ష్మి నీ మంచు మోహన్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరో గా ఉన్న ఆ స్టార్ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. ఆయన మంచు ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని దగ్గర బంధువు అని తెలుస్తుంది .అయితే మంచు లక్ష్మి నాకు అప్పుడే పెళ్లి వద్దని చదువుకుంటానని విదేశాలకు వెళ్లిపోయిందట. అంతేకాదు తనకు సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కరాకండిగా చెప్పేసిందట. ఈ క్రమంలోనే బడా ఇంటి ఫ్యామిలీకి కోడలు అయ్యే చాన్స్ మిస్ చేసుకుంది మంచు లక్ష్మి అంటూ ఓ న్యూస్ గతంలో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా ప్రజెంట్ మంచు లక్ష్మి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మరోవైపు ఆహా వారితో ఒక ఓ క్రేజీ కుకింగ్ షోను హోస్ట్ చేస్తుంది. భర్త, ఓ పాప తో చాలా హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news