Moviesప్రేమ అ ప‌నులు చేయ‌లేకే స్టార్ హీరోయిన్ కాలేద‌న్న విష‌యం తెలుసా...!

ప్రేమ అ ప‌నులు చేయ‌లేకే స్టార్ హీరోయిన్ కాలేద‌న్న విష‌యం తెలుసా…!

తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పటివరకూ చాలా తక్కువమందే ఉన్నారు. వారిలో కూడా ఎక్కువగా అప్పట్లో సావిత్రి గురించి మాట్లాడుకునేవారు. ఇప్పటివరకూ మాట్లాడుకుంటుంటారు. అంతగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. సావిత్రి జీవిత కథను బయోపిక్‌గా తీసి భారీ హిట్ అందుకున్నారంటే ఆమె సినీ, జీవితకథ ఎంతగా ప్రాముఖ్యత సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. సావిత్రి తర్వాత అంతగా పాపులర్ సాధించిందీ అంటే సౌందర్య.

సౌందర్య కూడా కెరీర్ ప్రారంభంలో కాస్త గ్లామర్ పాత్రలు చేసి సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. క్రేజ్ వచ్చిన తర్వాత సౌందర్య చాలాకాలం ఫ్యామిలీ పాత్రలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సావిత్రి తర్వాత మళ్ళీ అంతగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. ఇలాంటి కోవలోకి వచ్చి చేరిన మరో హీరోయిన్ ప్రేమ. ప్రేమ క‌న్న‌డ అమ్మాయి తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా ధర్మచక్రం. ఈ సినిమాతో ప్రేమ మంచి పేరు తెచ్చుకుంది.

ఈ సినిమా తర్వాత గ్లామర్ పాత్రలు ఏ భాషలో చేయలేకపోవడం ఆమెకి పెద్ద మైనస్ అయింది. సినిమా అంటే రంగుల ప్రపంచం. గ్లామర్ రోల్స్ చేసిన హీరోయిన్స్ ఈ తరం హీరోయిన్స్‌లో ఎక్కువగా నిలిచిపోతున్నారు. తమన్నా, అనుష్క, పూజా హెగ్డే, రష్మిక మందన్న పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూనే అందాల ఆరబోతతో అల్లాడిస్తున్నారు. అందుకే, ఇప్పుడు వారు పాన్ ఇండియా హీరోయిన్స్‌గా వెలుగుతున్నారు.

అంటే ఏ హీరోయిన్ కెరీర్ అయినా అన్నీ రకాల పాత్రలు చేస్తేనే ఉంటుంది. కానీ, దర్శకులు ప్రేమలో ఒకే కోణం చూశారు. ఆమె కూడా కమర్షియల్ హీరోయిన్ అవ్వాలని ఆలోచించలేదు. అందుకే, ఫ్యామిలీ హీరోయిన్‌గా అమ్మవారి పాత్రల్లో నటించి కొన్ని సినిమాల వరకే పరిమితం అయింది. అదే తన కెరీర్‌కి బాగా మైనస్ అయింది. అందాల ఆరబోతతో గనక ప్రేమ నాలుగు అడుగులు ముందుకేస్తే ఆ కెరీర్ వేరేలా ఉండేదనడంలో అసలు సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news