Moviesచీర తెచ్చాను..పది వేలు హుండిలో వేశాను..ఎందుకు గోల చేస్తున్నారు.. గుడిలో హేమ...

చీర తెచ్చాను..పది వేలు హుండిలో వేశాను..ఎందుకు గోల చేస్తున్నారు.. గుడిలో హేమ ఆగ్రహం..!!

ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. ప్రశాంతత కోసం.. గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్స్ కోసం.. కొంచమైనా మనసు ప్రశాంతంగా ఉండడానికి ..మన తలపై ఉన్న భారం దించుకోవడానికి గుడికి వెళ్తాం. అయితే అక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తే ..కచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది . అలాంటి పిచ్చి ప్రశ్నకే హేమకు కోపం వచ్చింది. ఒక్కసారిగా అమ్మవారి పూనిన్నట్టు ఆగ్రహంతో ఊగిపోయింది . దీంతో జర్నలిస్ట్ బెదిరిపోయాడు .ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే.. సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఎలాంటిదో మనకు తెలిసందే. ఉన్నది ఉ న్నట్టు మాట్లాడుతుంది .మొహానే మాట్లాడేసి తిట్టించుకునేయడం హేమ లక్షణం. అక్కడి మాట ఇక్కడ..ఇక్కడ మాట అక్కడ చెప్పడం హేమకు చేతకాదు. ఉన్న మాటే మాట్లాడుతుంది అందుకే సినీ ఇండస్ట్రీలో హేమాకి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాదు బడా స్టార్స్ కూడా ఆమెను పిలిచి మరి సినిమాల అవకాశాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాలో హేమ కనిపించాల్సిందే. అలాంటి ఓ ప్రత్యేక బాండింగ్ ఏర్పరచుకునింది పూరి జగన్నాథ్ నటి హేమ.

రీసెంట్ గా ఆమె కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నింది ఈ క్రమంలోనే అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయింది. అమ్మవారి సన్నిధిలో ఆమె మాట్లాడుతూ..” అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది . అమ్మవారిని చూడలేను ఏమో అనుకున్నాను. కానీ ఆ అమ్మవారి నన్ను తన దగ్గరికి రప్పించుకుంది అంటూ చెప్పుకొస్తున్న టైం లో రిపోర్టర్ మీరు టికెట్స్ తీసుకున్నారా లేదా అని ప్రశ్నించగా.. ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది హేమ . “ఏంటి గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా.. అమ్మవారికి 20,000 పెట్టి చేరు తెచ్చాను.. 10000 హుండీలో వేశాను టికెట్ గురించి అడుగుతున్నారా మీరు..? నేను ప్రోటోకాల్ ప్రకారమే అన్ని ఫాలో అవుతున్నాను. నేను దుర్గమ్మ భక్తురాలిని. అమ్మవారి కోసమే ఇక్కడికి వచ్చాను కాంట్రవర్సీ కోసం కాదు అంటూ”,, ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news