Moviesవామ్మో..క్యాష్ షో ఇంత మోసమా జరుగుతుందా.. కళ్ల ఎదుటే ఇంత దారుణమా..?

వామ్మో..క్యాష్ షో ఇంత మోసమా జరుగుతుందా.. కళ్ల ఎదుటే ఇంత దారుణమా..?

యాంకర్ సుమ..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. గలగల మాట్లాడుతూ.. వల్గారిటికి దూరంగా ..నేటివిటీకి దగ్గరగా ..సహజంగా పంచులు వేస్తూ అందరూ నవ్వుకునేలా యాంకరింగ్ చేస్తుంది . కాగా మరీ ముఖ్యంగా సుమ సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నుండి చేస్తున్న ప్రోగ్రాం ఏది అంటే అందరూ టక్కున చెప్పేది కాష్ ప్రోగ్రాం. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ క్యాష్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది .

మరీ ముఖ్యంగా క్యాష్ ప్రోగ్రామ్ లో లాస్ట్ రౌండ్లో కాలేజ్ స్టూడెంట్స్ ని పిలిపించుకొని ప్రశ్నలు అడిగే పద్ధతి ఇప్పటివరకు ఏ గేమ్ షో లో లేదు . అందుకే ఈ ప్రోగ్రాం జనాలకి బాగా నచ్చేస్తుంది . అయితే నిజంగానే క్యాష్ షోలో గెలిచిన వారికి డబ్బును ఇస్తారా ..? నిజంగానే ఆ స్టూడెంట్స్ సామాన్య స్టూడెంట్స్ నేనా.. లేదా కావాలని వీళ్ళు క్రియేట్ చేసి కొందరు స్టూడెంట్స్ ని అలా అక్కడికి పిలిపించి వాళ్ళని సెట్స్ లోకి రప్పించి ప్రశ్నలు వేస్తారా..? ఇలా చాలామందికి డౌట్లు ఉంటాయి.

కాగా రీసెంట్ గా దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. క్యాష్ ప్రోగ్రాంలో మనకు కనిపించే స్టూడెంట్స్ నిజమైన స్టూడెంట్స్ కాదు. వాళ్లంతా కూడా జూనియర్ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్లి అక్కడ స్టూడెంట్స్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఈటీవీ . అంతేకాదు మీరు బాగా గమనించినట్లయితే ఆ స్టూడెంట్స్ అందరిలో కొందరు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.. వాటికి సమాధానం చెబుతుంది సుమ. మిగతా వాళ్ళందరూ గప్ చుప్ గా సైలెంట్ గా ఉంటారు .

ఇదంతా స్క్రిప్ట్.. షో స్టార్ట్ అయ్యే ముందు స్క్రిప్ట్ అందరికీ క్లియర్గా వివరిస్తారనే న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఇన్నాళ్లు సుమ ప్రోగ్రాం అయినా నిజాయితీగా సాగుతుందని అనుకున్నాం . కానీ ఇది కూడా మొత్తం డ్రామా అని.. స్క్రిప్ట్ అని ..డబ్బులు చూపించి మళ్లీ ఆ డబ్బులను తీసుకెళ్లి బీరువాలో పెట్టేసుకుంటారని న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news