Moviesఎదురింటి కుర్రాడితో ప్రేమాయణంతో ఆ స్టార్ హీరోకే షాక్ ఇచ్చిన న‌దియా...!

ఎదురింటి కుర్రాడితో ప్రేమాయణంతో ఆ స్టార్ హీరోకే షాక్ ఇచ్చిన న‌దియా…!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించిన చాలా మంది ఇప్పుడు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో బిజీగా ఉన్నారు. అలాంటి లిస్ట్ నటి నదియా కూడా ఉన్నారు. నదియా అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కు అత్తగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తరవాత చాలా సినిమా ఆఫర్ల‌ను అందుకుంది. మలయాళ డైరెక్టర్ ఫాజిల్ ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల నదియా కు సినిమా ఆఫర్ లు సులువుగా వచ్చాయి. ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ఫాజిల్ నదియా వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి మమ్ముట్టి సినిమాలో ఆఫర్ ఉంది అని చెప్పారు.

ఆ తరవాత ఆడిషన్స్ లో కూడా నదియా మెప్పించి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో నదియా వరుస ఆఫర్ లు అందుకుంది. అంతే కాకుండా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తమిళ, మలయాళ భాషల్లో నదియాకు వ‌రుస‌గా సినిమా ఆఫర్ లు క్యూ కట్టాయి. ఇక నదియా సినిమా గురించి చాలా మందికి తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

నదియా ఇంటర్ చదువుతున్న సమయంలోనే తమ ఇంటికి ఎదురుగా ఉండే శిరీష్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే శిరీష్ అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కన్నాడట. నదియా సినిమా అవకాశాల కోసం చూస్తున్న సమయంలో శిరీష్ అమెరికాకు వెళ్ళిపోయాడు. అంతే కాకుండా నదియా కు సినిమా ఆఫర్ లు వచ్చే సమయంలో అతడు ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

దాంతో సినిమాలను వదులుకుని నదియా శిరీష్ ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. అయితే శిరీష్ తో పెళ్ళి కుదరగానే నదియా కు బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మైనే ప్యార్ కియా సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సమయం లో మళ్లీ సినిమాలో నటిస్తే జీవితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని నదియా భావించి రిజెక్ట్ చేసింది. ఆ తరవాత నదియాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కాగా నదియాకు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మలయాళ రీమేక్‌లో నటించే ఛాన్స్ వచ్చింది.

అప్పుడు ఆమె భర్త ఇప్పటివరకు చేసిన త్యాగాలు చాలు. ఇక నీకు నచ్చిన సినిమాల్లో నటించి అని చెప్పారట. దాంతో నదియా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ఇక ఇప్పుడు బిజీ నటిగా మారిపోయింది. ఇక న‌దియాకు ఇద్ద‌రు పిల్ల‌లు. రీ ఎంట్రీలో ఆమె బాగా బిజీ ఆర్టిస్టుగాను, హ‌య్య‌స్ట్ ఫెయిడ్ ఆర్టిస్టుగాను మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news