Moviesసమంత కు కోలుకోలేని షాక్.. కొంప ముంచేసిన చెత్త నిర్ణయం..!?

సమంత కు కోలుకోలేని షాక్.. కొంప ముంచేసిన చెత్త నిర్ణయం..!?

సమంత ఈ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతుంది.. ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఆమె చేసే సినిమాలు ఒక రీజన్ అయితే మరొకటి ఆమె వ్యక్తిగత జీవిత కారణాలు అని కూడా తెలుస్తుంది. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది .దాదాపు ఆమె విడాకులు ప్రకటించి సంవత్సరం కావస్తుంది. అయినా కానీ ఇప్పటికీ వాళ్ళ విడాకులకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ కారణంగా సమంత నాగచైతన్య ట్రోల్ అవుతూనే ఉన్నారు.

కాగా సమంత విడాకుల తర్వాత ఏమాత్రం బ్యాక్ స్టెప్ వేయకుండా ధైర్యంగా సినిమాలకు సైన్ చేస్తూ తనదైన స్టైల్ లో మూవీస్ కి కమిట్ అవుతుంది . ఈ క్రమంలోనే సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం. ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయని ఓ పౌరాణిక కథను తీసుకొని దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా శాకుంతలం అనే పేరుతో త్వరలోనే మనం ముందుకు రాబోతుంది.

కాగా దాదాపు ఏడాది కాలం పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకే అంకితమైన శాకాంతం ఈ మధ్యనే సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2022 నవంబర్ 4న శకుంతలం సినిమా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ ప్రకటన ఇచ్చారు . అయితే అనూహ్యంగా ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ విషయంలో యూటర్న్ తీసుకుంది. అంతే కాదు సినిమాను త్రీడీలో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఆడియన్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఇలా చేస్తున్నాం అంటూ ఓ నోట్ ఇచ్చింది. దీనితో శాకుంతలం సినిమా అనుకున్న టైం కి కంటే కొంచెం లేటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు .

అయితే ఇలా సమంత సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి బ్యాక్ స్టెప్ వేయడం పై కొన్ని సినీ పెద్దల హస్తం ఉంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా శాకుంతలం సినిమాని కొందరు పెద్ద వ్యక్తులు ఆపుతున్నారని అందుకే శకుంతల సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఇప్పటివరకు రిలీజ్ కి సిద్ధం అవ్వలేదని గతంలో వార్తలు వినిపించాయి. మరి ఇలాంటి టైం లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేయడం నిజంగా సమంత కెరీర్ కు బిగ్ మైనస్ అనే చెప్పాలి. దీంతో సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడమే దీనికి కారణం అంటూ కావాలని అక్కినేని నాగార్జున తన పలుకబడితో సమంత కెరీయర్ ని తొక్కేస్తున్నాడు అంటూ సమంత ఈ చెత్త నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో సమంత సినిమా. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news