Moviesపూజా పాపకు పగిలిపోయే ఆన్సర్..రష్మిక ధైర్యానికి హ్యాట్సాఫ్..!?

పూజా పాపకు పగిలిపోయే ఆన్సర్..రష్మిక ధైర్యానికి హ్యాట్సాఫ్..!?

సినీ ఇండస్ట్రీలో జనరల్ గా కాంపిటీషన్స్ ఉంటాయి. ఓ హీరోయిన్ అనుకున్న కథకు మరో హీరోయిన్ సెలక్ట్ అవ్వడం తద్వారా ఆమె బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం. లేకపోతే అట్టర్ ఫ్లాప్ సినిమాను వేసుకోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. అయితే ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కి ఇదే విషయం రిపీట్ అవుతూ ఉంటే అది మాత్రం సర్వసాధారణం కాదు. ఎస్ ఇప్పటివరకు పూజా హెగ్డే వదులుకున్న మూడు బడా ప్రాజెక్ట్లకు రష్మిక మందన సెలెక్ట్ అయ్యి ఆ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజా హెగ్డే కు రష్మిక మందన్నాకు ఉండే ఇమేజ్ , క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనకు తెలిసిందే. స్టార్ బ్యూటీస్ ఇద్దరు కూడా వాళ్లకు తగిన పాత్రలతో సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని తమదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. అయితే రయ్యి మంటూ దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరియర్ కు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో బేక్ పడింది. ఈ క్రమంలో పూజ హెగ్డే పేరును పట్టించుకునే నాధుడే లేకపోయాడు. అదే టైంలో రష్మిక మందన ఏమాత్రం ఆగకుండా దూసుకుపోతూనే ఉంది . ఓవైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ మధ్యలో కోలీవుడ్.. మూడు భాషలలో కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఊపిరాడనంత బిజీగా షెడ్యూల్ సెట్ చేసుకుంది.

కాగా ఈ క్రమంలోనే పూజ హెగ్డే తల పొగురుతో వదులుకున్న ఓ బిగ్ ఆఫర్ ని రష్మిక మందన తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్ఫామ్ చేసిన సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయ్. మరోసారి పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో ఈ సినిమాల్లో అదరకొట్టబోతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజ హెగ్డే అని అనుకున్నారట. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా ఆల్మోస్ట్ ఆమె కన్ ఫామ్ అయినట్టు హరిశంకర్ పలు ఇంటర్వ్యూలో పరోక్షంగా కామెంట్ చేసి కన్ఫామ్ చేశారు . అయితే సినిమా షూటింగ్ లేట్ అవుతున్న కారణంగా పూజ హెగ్డే సినిమా నుంచి తప్పకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పూజా వద్దు అనుకున్న ఈ ఆఫర్ రష్మిక వద్దకు వెళ్లడంతో ఆమె ఎగిరి గంతేసి ఓకే చేసిందట. గతంలో రెండు సినిమాల విషయంలో కూడా ఇలాగే జరిగిందట . పూజ హెగ్డే కమిటీ అయ్యి వద్దనుకున్న సినిమాలు ఆఖరికి రష్మిక దగ్గరికి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇలా పూజ హెగ్డే తనకొచ్చిన ఆఫర్లు వదులుకుంటూ రష్మిక కెరియర్ ని సెటిల్ చేసే పనిలో పడింది అంటూ జనాలు ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news