Moviesమెగా హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సదా.. రీజన్ వింటే...

మెగా హీరో ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సదా.. రీజన్ వింటే నవ్వేస్తారు..!?

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటాడు. ఒక హీరోయిన్ తో అనుకున్న సినిమాను మరో హీరోయిన్ తో కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. కానీ ఒక ఆఫర్ మన చేతికి వచ్చినప్పుడు రిజెక్ట్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువ. అది కూడా మెగాస్టార్ లాంటి హీరోల సినిమాలో ఆఫర్ వస్తే చచ్చిన ఏ హీరోయిన్ వదులుకోదు. ఎవరో రేర్ గా వదులుకుంటారు. ఆ లిస్ట్ లోకి చేరింది హీరోయిన్ సదా.

సదా పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. జయం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని.. ఆ తర్వాత తెలుగు తమిళంలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా కొన్ని రాంగ్ స్టోరీస్ చూస్ చేసుకోవడం వల్ల సదా కెరియర్ మధ్యలోనే బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గా సదా తన సెకండ్ ఇన్నింగ్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది. వచ్చిన ఆఫర్లలో క్రేజీ ఆఫర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ తాను హీరోయిన్ గా ఎలా ఎదగాలి అన్న దానిపై కాన్సన్ట్రేషన్ చేస్తుంది.

ఈ క్రమంలోని మెగాస్టార్ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సదా. మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి తమన్న హీరోయిన్ గా నటిస్తున్న “భోళా శంకర్” సినిమాలో సదాను ఓ చిన్న పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట మేకర్స్. ఓ విధంగా చెప్పాలంటే ఐటమ్ సాంగ్ చేసి ఆ తర్వాత ఒక పది నిమిషాల కామెడీ క్యారెక్టర్ కి ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే సదా మెగాస్టార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడలేదు. ” అంతటి పెద్ద స్టార్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే మిగతా స్టార్స్ కూడా తనను ఐటం గర్ల్ గానే చూస్తారు” అంటూ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక ఈ ఆఫర్ శ్రీముఖి చేతికి వెళ్లినట్టు తెలుస్తుంది .ఇక ఇంతటి పెద్ద స్టార్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు సదాను చూసి అందరు నవ్వుతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news