Moviesకీర్తి సురేష్‌తో నిజంగా ఆ తమిళ హీరో డేటింగ్‌లో ఉన్నాడా..?

కీర్తి సురేష్‌తో నిజంగా ఆ తమిళ హీరో డేటింగ్‌లో ఉన్నాడా..?

సౌత్‌లో కీర్తి సురేష్‌కి ఉన్న క్రేజ్ ఏపాటిదో అదరికీ తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషలలో కూడా హీరోయిన్‌గా నటిస్తూ మంచి ఫాంలో ఉంది. గత మూడు నాలుగేళ్ళుగా హిట్స్ లేకపోయినా కూడా కీర్తికి మాత్రం హీరోయిన్ అవకాశాలకు కొదవలేదు. కథ నచ్చితే రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సిస్టర్‌గా కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. మహానటి సినిమా తెచ్చిన క్రేజ్ కీర్తికి అసాధారణం అని చెప్పాలి. ఈ ఒక్క సినిమా ఎంత లేదన్నా 10 ఏళ్ళ పాటు మైలేజ్‌ను తెచ్చిపెట్టింది.

అదే తనకి అన్నీ రకాల జోనర్స్‌లో సినిమాలు చేసే అవకాశాలను ఇచ్చింది. నేషనల్ అవార్డ్ విన్నర్ నరేష్ కుకునూర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో సినిమాలను చేసింది. కార్తీక్ సుబ్బ రాజ్ నిర్మాణంలో పెంగ్విన్, అలాగే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి కంప్లీట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ చేసింది కీర్తి. అయితే, ఈ మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలాయి. తమిళంలో రజినీకాంత్‌కి చెల్లిగా నటించిన అణ్ణాత్త సినిమా కూడా డిజాస్టర్ కావడం కీర్తికి షాకిచ్చింది.

కాస్త నితిన్ సరసన చేసిన రంగ్ దే, మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట సినిమాలు యావరేజ్ హిట్ సాధించాయి. వీటిలో కూడా సర్కారు వారి పాట కీర్తికి మళ్ళీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఈ సినిమాలో అందాల ఆరబోత కూడా బాగానే చేసి ఆకట్టుకుంది. నాభి అందాలను చూపించి చూపించనట్టుగా కనిపించి మెస్రమైజ్ చేసింది. అయితే, తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ సరసన కీర్తి సురేష్ రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది.

ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరిందట. ప్రేమలో కూడా ఉన్నట్టుగా కూడా అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. శివ కార్తికేయన్, కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. కేవలం శివ కార్తికేయన్‌తో మాత్రమే కాదు, బిజినెస్ మేన్‌తోనూ కీర్తికి పెళ్ళి చేశారు. కానీ, అవన్నీ పూర్తిగా గాసిప్స్ అని చాలాసార్లు కీర్తి నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. అయినా తన క్రేజ్ వల్ల ఆ వార్తలకి మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. ప్రస్తుతం నాని దసరా సినిమా చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news