Moviesమొగుడు సంతోషం కోసం ప్రియాంక షాకింగ్ నిర్ణయం.. ప్రతి మగాడికి నీలాంటి...

మొగుడు సంతోషం కోసం ప్రియాంక షాకింగ్ నిర్ణయం.. ప్రతి మగాడికి నీలాంటి భార్యే ఉండాలి..!!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ ఫోటోషూట్స్ చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ..ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. మనకు తెలిసిందే ప్రియాంక చోప్రా తనకంటే వయసులో 10 సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అప్పట్లో వీళ్ళ వివాహం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. నిజానికి ఒకటి రెండు సంవత్సరాలు గ్యాప్ అంటే కామన్ అనుకుంటారు కానీ పది సంవత్సరాల తేడాతో అది కూడా చిన్న వయసు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది.

అయినా కానీ వీరిద్దరూ అలాంటి కామెంట్స్ ని ఏం పట్టించుకోకుండా తమ మ్యారీడ్ లైఫ్ ను హ్యాపీగా ముందుకు తీసుకెళ్లారు. ఈ మధ్యనే సరోగసి ప్రాసెస్ ద్వారా ప్రియాంక చోప్రా ఓ పాపకు అమ్మ అయ్యింది. కాగా రీసెంట్గా నిక్ జోనస్ బర్త డే ను ప్రియాంక చోప్రా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దీనికోసం అమ్మడు దాదాపు 15 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కేవలం 10 గంటల సంతోషం కోసం 15 కోట్లు ఖర్చు చేయడం షాకింగ్ గా మారింది. అంతేకాదు ఈ బ్యూటీకి పిచ్చి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ “తన భర్త సంతోషం ముందు 15 కోట్లు నాకు ఏమీ ఎక్కువ కాదు అంటుంది “ప్రియాంక చోప్రా.

నిక్ జోనస్ పుట్టినరోజు సందర్భంగా అతడికి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ప్రియాంక చోప్రా. భర్త పుట్టినరోజు ఏకంగా ప్రైవేట్ జెట్ ని బుక్ చేసి ఆకాశంలో అతడి బర్త డే ని సెలబ్రేట్ చేసింది. ఈ విషయం నిక్ జోనస్ కు తెలియదు. దీంతో చివరి నిమిషంలో ఫ్లైట్ ఎక్కిన ఆయన ప్రియాంక షాకింగ్ సర్ ప్రైజ్ చూసి షాక్ అయ్యాడు. దీంతో ఈ సర్ప్రైజ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ప్రియాంక చోప్రా నిక్ జోనస్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఇంతటి హ్యాపీ మూమెంట్స్ లో కూడా ఈ జంటను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. “ప్రియాంక చోప్రా నలభై లో అడుగు పెడితే నిక్ జోనస్ ఇంకా 30 లోనే ఉన్నాడు, ఈ అదృష్టం ఎవరికి దొరకదు కదా ప్రియాంక “అంటూ ఆమెను పరోక్షంగా వల్గర్ గా కామెంట్ చేస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు చేసే ట్రోలింగ్ కి గురవుతున్న హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Nick Jonas (@nickjonas)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news