Moviesమాజీ బాయ్ ఫ్రెండ్ కు అమ్మగా బాలీవుడ్ హాట్ బ్యూటీ.. తండ్రి...

మాజీ బాయ్ ఫ్రెండ్ కు అమ్మగా బాలీవుడ్ హాట్ బ్యూటీ.. తండ్రి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

“బ్రహ్మాస్త్ర” సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 100 కోట్లు క్రాస్ చేసి బాలీవుడ్ కి మళ్ళీ పునర్ వైభవం తీసుకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోస్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తెలుగులో “బ్రహ్మాస్త్రం” అనే పేరుతో రిలీజై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ యంగ్ దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, అమితాబచ్చన్, షారుక్ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సోషియో ఫాంటసీ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది.

అంతేకాదు విమర్శకులు సైతం ఈ సినిమాని ఓ రేంజ్ లో పొగిడేశారు. కాగా బ్రహ్మాస్త్ర చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నట్లు రిలీజ్ కు ముందే అయాన్ ముఖర్జీ అఫీషియల్ గా ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ ని “బ్రహ్మాస్త్రం: శివ” అనే పేరుతో తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ.. రెండో పార్ట్ ను మరింత క్యూరియాసిటీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. దీని కోసం మొదటి భాగం చివరలోనే హింట్ ఇచ్చారు. అంతేకాదు మొదటి భాగంలో అగ్ని అస్త్రాగా డీజే శివాగా నటించిన రణబీర్ కపూర్ .. ఆ తరువాత చివర్లో అమృత జల్: అస్త్రంగా దీపిక పదుకొనేను పరిచయం చేశారు. అంటే దీపికా పదుకొనే రణబీర్ కపూర్ తల్లిగా నటిస్తుంది .

మనకు తెలిసిందే గతంలో రణబీర్ కపూర్ – దీపిక పదుకొనే ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. డేటింగ్ చేస్తున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించకపోయినా చట్టపట్టలేసుకొని ఇద్దరు చేతిలో చేయి వేసుకొని తిరగడం మీడియా కంట పడింది. కానీ కొన్ని కారణాల చేత ఇద్దరు విడిపోయి వేరు వేరు పెళ్లిలు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు. మళ్ళీ ఇలా బ్రహ్మాస్త్ర సినిమాతో దీపికా పదుకొనే రణబీర్ తల్లిగా నటించడానికి ఓప్పుకోవడం బాలీవుడ్ జనాలకు షాకింగ్ గా ఉంది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. దేవ్ అనేది ఇందులో శివ తండ్రి పాత్ర . ఈ క్యారెక్టర్ లో రన్వీర్ సింగ్ నటిస్తేనే బాగుంటుంది అంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి అయాన్ ముఖర్జీ దేవ్ పాత్రలో ఏ హీరోని పెట్టాలనుకుంటున్నారో.. అయితే ఇక్కడ దీపికా పదుకొనే -రణబీర్ కపూర్ కాంబినేషన్లో సీన్లు ఉంటాయో లేదో చెప్పలేం అంటూ మరో టాక్ కూడా నడుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news