Moviesపెళ్లి అయిన హీరోతో ప్రియ‌మ‌ణి ఎఫైర్‌... పెళ్లికాని హీరోతో పెళ్లి...!

పెళ్లి అయిన హీరోతో ప్రియ‌మ‌ణి ఎఫైర్‌… పెళ్లికాని హీరోతో పెళ్లి…!

సినిమా రంగంలో ఉన్నవారికి గాసిప్ లతో ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. సినీ ఫీల్డ్ అనేది గ్లామర్ రంగం కావడంతో సహజంగానే వారి గురించి ఏ చిన్న వార్త వచ్చినా తెలుసుకునేందుకు సినీ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నదంతా సోషల్ మీడియా యుగం కావడంతో సెలబ్రిటీలుగా ఉన్నవారిపై, సినీ రంగంలో ఉన్న వారిపై చాలామంది ఏదో ఒక వార్త అల్లేస్తున్నారు. ఇందులో వాస్తవ, అవాస్తవాల సంగతి ఎలా? ఉన్నా.. ఆ రోజుకు ఆ పోస్ట్ పెట్టిన వారి పబ్బం గడిచిపోతుంది.

ఇక ఈ గాసిప్‌లకు చాలామంది సెలబ్రిటీలు బలైపోతూ ఉంటారు. అయితే కొందరు వీటిని లైట్ తీసుకొని పక్కన పెడుతున్నా, మరికొందరు మాత్రం సీరియస్ గా తీసుకుంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక తెలుగు ప్రజలకు రెండు దశాబ్దాలకు పైగా సీనియర్ నటి ప్రియమణితో ఎంతో అనుబంధం ఉంది. 2002లో నిర్మాత కేఎస్ రామారావు తనయుడు హీరోగా వచ్చిన `ఎవరే అతగాడు` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రియమణి.అప్పట్లో జగపతిబాబు – ప్రియమణి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `పెళ్ళైనకొత్తలో` సినిమా సూపర్ హిట్ అయింది.

అప్పటినుంచి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మంచి క్రేజ్ ఉండేది. వరుసగా ప్రియమణి, జగపతిబాబు సినిమాలు చేయటంతో కొందరు గాసిప్ ప్రియులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న పుకార్లు బాగా ప్రచారం చేశారు. అయితే ఇలాంటి విషయాలను జగపతిబాబు ముందు నుంచి లైట్ తీసుకుంటారు. ప్రియ‌మ‌ణితో తనకు ఒక పుకారు ఉందన్న విషయాన్ని కూడా ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఈ పుకార్లపై ప్రియమణి మొదట్లో కాస్తంత ఇబ్బంది పడిన, తర్వాత ఆమె కూడా పట్టించుకోవడం మానేసింది.

విచిత్రం ఏంటంటే అదే సమయంలో మరో యంగ్ హీరో తరుణ్ కు ప్రియ‌మ‌ణికి మధ్య ప్రేమాయణం నడుస్తుందని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు కూడా ప్రచారం చేశారు. అయితే అది కూడా జరగలేదు. తర్వాత ప్రియమణి తన స్నేహితుడు అయిన ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకొని హ్యాపీగా పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

పెళ్లి తర్వాత కూడా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తోంది. సీనియర్ హీరో వెంకీ కి జోడిగా `నారప్ప` తో పాటు దగ్గుబాటి రానా `విరాటపర్వం` సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది. మంచి ప్రాధాన్య‌త పాత్రలు వస్తే నటించేందుకు ప్రియమణి సిగ్నల్స్ ఇస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news