Moviesఆ విషయంలో కొడుకులనే మించి పోయిన నాగార్జున..ఘోస్ట్ సినిమా కోసం కళ్లు...

ఆ విషయంలో కొడుకులనే మించి పోయిన నాగార్జున..ఘోస్ట్ సినిమా కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలకు సైన్ చేస్తున్నారు సీనియర్ హీరోలు . ఇంకా పక్కాగా చెప్పాలంటే సీనియర్ హీరోలే మంచి మంచి స్టోరీ ఉన్న కంటెంట్లను చూస్ చేసుకుంటున్నారు. యంగ్ హీరోలు అదే పాత చింతకాయ పచ్చడి లాగా.. అదే లవ్ స్టోరీలు ..అవే రొమాంటిక్ సీన్లు.. అవే రివేంజ్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు డిఫరెంట్ డిఫరెంట్ కథలను చూసి చేసుకుంటూ సినీ ఇండస్ట్రీకి కొత్త హంగులను అద్దుతున్నారు.

కాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున మరికొద్ది రోజుల్లో ఘోస్ట్ గా మనల్ని ఆదరించబోతున్నాడు. ఘోస్ట్ అనే సినిమా ద్వారా నాగార్జున జనాల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో కింగ్ నాగార్జున హీరోగా అందాల బ్యూటీ సోనాలి చౌహన్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఘోస్ట్ . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బోలెడన్ని హ్యూజ్ ఎక్స్పెక్ టేషన్ పెట్టుకొని ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. అంతేకాదు అక్కినేని చరిత్రలోనే ఫస్ట్ టైం ఈ సినిమా 100 100 కోట్లు క్రాస్ చేసి ఆ క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ సినిమా కోసం నాగార్జున తన కెరియర్ లోని ఫస్ట్ టైం 55 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటివరకు ఇంత స్థాయి రెమ్యునరేషన్ తన కొడుకులు కూడా తీసుకోలేదు .మనకు తెలిసిందే హీరో నాగచైతన్య ఫుల్ వరస ఫ్లాప్ సినిమాలతో కెరీర్ డిజాస్టర్ గా మలుచుకున్నాడు . ఇక అఖిల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆయన సొంత హీరోగా ఆయన సొంత టాలెంట్ తో పెట్టు కొట్టిన సినిమా ఒక్కటి కూడా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినప్పటికీ . అది కాస్త పూజా హెగ్డే ఖాతాలోనే పడిపోయింది .ఈ క్రమంలోని కొడుకులకు మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీనియర్ హీరోగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు కింగ్ నాగార్జున.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news