Moviesనాగచైతన్య కోసం ఆ పనికి ఒప్పుకున్న కృతిశెట్టి..కెరీర్ లోనే ఫస్ట్ టైం...

నాగచైతన్య కోసం ఆ పనికి ఒప్పుకున్న కృతిశెట్టి..కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!?

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీలదే హవా అయిపోతుంది. వాళ్లలో ముఖ్యంగా కృతిశెట్టి శ్రీలీల సీనియర్ హీరోయిన్లకు ధీటుగా ఆఫర్లు అందుకుంటూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అంతేకాదు శ్రీలీల ముదురు హీరోల పక్కన కూడా సినిమాలు చేయడానికి సిద్ధపడింది. తన కెరియర్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. ఇక కృతి శెట్టి ఆల్ రెడీ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

ఆల్ రెడీ బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య రొమాన్స్ చేసి మంచి మార్కులు వేయించుకున్న అమ్మడు.. మరోసారి ఆయనతో నటించడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 22వ సినిమాలో అందాల బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. రీసెంట్ గా థాంక్యూ సినిమా తో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్నాడు. ప్రయోగాత్మక కథాంశంతో యాక్షన్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపిక చేసిన్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు చిత్ర బృందం. కాగా ఈ సినిమా కోసం కృతి శెట్టి ఫస్ట్ టైం మనకు ప్రేతాత్మ రోల్ లో కనిపించనుందట.

ఇప్పటివరకు అందంగా ట్రెడిషనల్ గా మోడ్రెన్ గా అలరించిన కృతి శెట్టి ఫస్ట్ టైం కెరియర్లో ప్రేతాత్మ రోల్ చేయనున్నట్లు.. దానికి తగ్గ మేకప్ వేసుకొవడానికి సిద్ధపడిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . నిజానికి కృతి శెట్టి వయసు చాలా చిన్నది నాగచైతన్యతో కంపేర్ చేస్తే మరీ చిన్నది. అయినా కానీ అంతటి పెద్ద హీరో పక్కన నటించడానికి సిద్ధపడటం ఒక సాహసం అనే చెప్పాలి.

అయితే అలాంటి పెద్ద హీరో సినిమాలో ప్రేతాత్మగా నటించడానికి ఒప్పుకోవడం షాకింగ్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాలో అమ్మడు డ్యూయల్ రోల్ నటించబోతుందని.. ఒకటి ప్రేతాత్మగా మరొకటి నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా మరికొద్ది రోజుల్లో కృతశెట్టి నటించిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా నాగచైతన్య తో సినిమా పై పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news