Moviesబామ్మ‌ర్ది నితిన్‌ను ఎన్టీఆర్ లైట్ తీస్కొంటున్నాడా... అస‌లు కార‌ణం ఇదే..!

బామ్మ‌ర్ది నితిన్‌ను ఎన్టీఆర్ లైట్ తీస్కొంటున్నాడా… అస‌లు కార‌ణం ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కేజిఎఫ్ – సలార్ సినిమాల‌ దర్శకుడు ప్రశాంత నీల్‌ దర్శకత్వంలో తన 31 సినిమాకు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కొరటాల శివ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బావమరిది అయిన లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ కూడా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నార్నే ఫ్యామిలీది పెద్ద పారిశ్రామికవేత్తల కుటుంబం. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు పెద్ద పారిశ్రామికవేత్త అన్న విషయం తెలిసిందే. ఇక నార్నే నితిన్ ఫస్ట్ సినిమా శతమానం భవతి – ఎంత మంచివాడవురా లాంటి ఫ్యామిలీ సినిమాలు తెర‌కెక్కించిన‌ దర్శకుడు సతీష్ వేగేశ్న‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

గ‌తేడాది ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా న‌డుస్తూనే ఉంది. అయినా కూడా ఇంకా రెండు పాట‌ల‌తో పాటు టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంద‌ట‌. అయితే ఎన్టీఆర్ కూడా ఎందుకో గాని బామ్మ‌ర్ది సినిమాను సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌న్న గాసిప్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ క‌నుక సీరియ‌స్‌గా ప‌ట్టించుకుని ఉంటే ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యి సినిమా రిలీజ్ కూడా అయిపోయి ఉండేది.

ఓ వైపు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఆరు నెల‌లు దాటుతోంది. ఇంకా కొర‌టాల సినిమా క‌థ ఫైన‌ల్ కాక‌.. ఎన్టీఆర్ త‌న టెన్ష‌న్స్ లో తాను ఉన్నాడు. అందుకే బామ్మ‌ర్ది సినిమా విష‌యంలో దృష్టి పెట్టేంత టైం ఎన్టీఆర్‌కు లేద‌ని అంటున్నారు. మ‌రి నార్నే నితిన్ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్ప‌ట‌కి రిలీజ్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news