Moviesఇండస్ట్రీలో ఆ హీరో భజన ఎక్కువైందిగా..ఏందిరోయ్ ఏదో తేడాకొడుతుందే..!?

ఇండస్ట్రీలో ఆ హీరో భజన ఎక్కువైందిగా..ఏందిరోయ్ ఏదో తేడాకొడుతుందే..!?

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరభాష నటులు ఎక్కువ మంది వస్తున్నారు. అఫ్కోర్స్ ముందు నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీపై బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు పరభాష నటులు. తెలుగు జనాలు కుల మత భాషా భేదాలు లేకుండా అందరినీ ఈక్వల్ గానే ఎంకరేజ్ చేస్తారని ఓ మంచి పేరు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. ఆ కారణంగానే పక్క భాష నటులు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో పాగా వేయడానికి ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇప్పటికే అలా తమిళ మలయాళ కన్నడ భాషల నుంచి హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు బోలెడు మంది వచ్చి రాజ్యమేలుతున్నారు.

ఈ క్రమంలోనే రీసెంట్ గా మలయాళ భాష నుండి తెలుగులోకి ఎంటర్ అయిన స్టార్ హీరో కొడుకు దుల్కర్ సల్మాన్ పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. నాచురల్ గా ఉంటుంది బిహేవియర్ టూ గుడ్ కానీ ఓ వర్గం మాత్రం మన తెలుగు హీరోలను తొక్కేస్తూ దుల్కర్ సల్మాన్ ను పొగడడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు మహానటి సినిమాలో ఓ క్యారెక్టర్ చేసిన దుల్కర్ సల్మాన్.. రీసెంట్ గా సీతారామం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఒక్క సినిమాతో దుల్కర్ సల్మాన్ ఓ రేంజ్ లో పాపులర్ పాపులర్ అయిపోయాడు తెలుగులో. అయితే అంతకుముందు ఉన్న హీరోలతో కంపేర్ చేస్తూ దుల్కర్ సల్మాన్ ను పొగడడం మన తెలుగు హీరోలను తక్కువ చేయడం సరికాదు అంటున్నారు సినీ ప్రముఖులు. రీసెంట్ గా ఓ ఫంక్షన్ లో పెద్దాయన మాట్లాడుతూ..” మన తెలుగు హీరోల సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయని ..పక్క భాష నటుల సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయని.. దీనికి కారణం వాళ్లలోని నటన టాలెంట్ అని ..మన హీరోలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి “అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. మన హీరోలను కాదని పక్క హీరో లని పొగడడం న్యాయమే అంటారా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news