Moviesలక్ష ఇస్తే కోరుకుంది చేస్తావా అన్నాడు....ఆ డైరెక్టర్‌పై బిగ్‌బాస్ బ్యూటీ ఆరోపణలు...!

లక్ష ఇస్తే కోరుకుంది చేస్తావా అన్నాడు….ఆ డైరెక్టర్‌పై బిగ్‌బాస్ బ్యూటీ ఆరోపణలు…!

ఒకప్పుడు సెలబ్రిటీగా గుర్తింపు రావాలంటే ఏదైనా సూపర్ హిట్ సినిమాలో లేదా సీరియల్స్‌లో నటించాలి. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ లో ఒక్క వారం ఉన్నా చాలు ఎంతో గుర్తింపు వస్తుంది. అలా బిగ్‌బాస్ కు ముందు అసలు ఎవరికి తెలియని వాళ్ళు చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు. అలా సెలబ్రిటీ స్టేటస్ రావడంతో పాటు అడపా దడపా సినిమా ఆఫర్ లు అందుకుంటున్నారు. ఇక మరింకొందరు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ వల్ల సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న వారి లిస్ట్ లో శ్వేతా వర్మ కూడా ఉంటారు.

శ్వేతావర్మ అచ్చ తెలుగు అమ్మాయి. అందం అభినయం ఉన్నా ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోయింది. బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటూ శ్వేత వర్మ పచ్చీస్ సినిమా తో ఫేమస్ అయ్యింది.
ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల పేరుతో అమ్మాయిల‌ను వాడుకునేందుకు చాలా మంది రెడీగా ఉన్నార‌ని… వాళ్లు మ‌న‌ల‌ను ఎలా మాయ‌లో ప‌డేయాలా ? అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటార‌ని శ్వేత చెప్పింది.

కాగా ఓ ఇటర్వ్యూలో శ్వేతావర్మ సంచలన కామెంట్స్ చేసింది. తాను షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తున్న సమయం లో కొంతమంది కమిట్మెంట్ అడిగారని చెప్పింది. కమిట్మెంట్ అడిగితే ప్రాజెక్ట్ కోసం అనుకున్నా కానీ వాళ్ళ ఉద్దేశ్యం వేరని తర్వాత తెలుసుకున్నట్లు పేర్కొంది. ఆ ఛాటింగ్ స్క్రీన్ షాట్ లు కూడా తనవద్ద ఉన్నాయని తెలిపింది.

2015లో ఓ యాడ్ కోసం సంప్రదించారని లక్ష ఇస్తాం కానీ… దర్శకుడు కోరింది చేయాలని చెప్పారని తెలిపింది. దాంతో తాను షాక్ అయ్యానని… అతడిని బిల్డింగ్ మీద నుండి దూకండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయా అని చెప్పింది. అంతే కాకుండా కాస్టింగ్ కౌచ్ సమస్యలు సోషల్ మీడియా లో కూడా ఎదుర్కొన్నట్టు పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news