Moviesఆ హీరోయిన్‌తో అల్లు అర్జున్ డేటింగ్‌.... వారిద్ద‌రి మ‌ధ్య అంత జ‌రిగిందా...!

ఆ హీరోయిన్‌తో అల్లు అర్జున్ డేటింగ్‌…. వారిద్ద‌రి మ‌ధ్య అంత జ‌రిగిందా…!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలవైకుంఠ‌పురంలో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో బన్నీ చాలావరకు నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసేశాడు. ఇక మొన్న కరోనా త‌ర్వాత‌ వచ్చిన పుష్ప సినిమాతో బన్నీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన పుష్ప బాలీవుడ్ లో ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు సాధించటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమాకు ఏకంగా రు. 400 కోట్ల భారీ వసూళ్లు వచ్చాయి. టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సినిమాలలో పుష్ప టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం పుష్ప‌ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభమైంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ స్నేహరెడ్డిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. తన ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌కు కెరీర్ ప్రారంభం నుంచి ఏ హీరోయిన్లతో లింకులు ఉన్నట్టు వార్తలు రాకపోయినా… ఒకరిద్దరు హీరోయిన్ల విషయంలో మనోడిపై కూడా పుకార్లు షికారులు వచ్చాయి. ఈ ఇద్దరు హీరోయిన్లలో టాక్సీవాలా హీరోయిన్‌గా చేసిన తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ ఓ ఫంక్షన్ లో మాట్లాడుతూ బన్నీ అంటే తనకు ఎంతో క్ర‌ష్ అని ఓపెన్‌ గా చెప్పేసింది.

అప్పుడు బన్నీకి ప్రియాంక జవాల్కర్ కు మధ్య ఏదో ఉందన్న పుకార్లు.. షికారులు చేశాయి. ఇక తాజాగా ఈ లిస్టులోకి కేతిక శర్మ పేరు కూడా చేరింది. ఆమె ఇప్పటివరకు చేసింది రెండు మూడు సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్య సినిమాలో నటించిన ఈ అమ్మడు తాజాగా మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న రంగ రంగా వైభవంగా సినిమాలో నటించింది.

అయితే కేతిక హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇన్‌స్టాగ్రామ్ లోను… టిక్‌టాక్ లో డబ్‌స్మాష్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయింది. కేతిక హీరోయిన్ అవకముందే ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. కేతిక శర్మ థ‌గ్‌ లైఫ్ అనే వీడియో ద్వారా ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయింది. ఇక తెలుగులో కేతిక‌ చేసినవి రెండు సినిమాలే అయినా ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ వచ్చేసింది.

కేతిక శర్మ 26 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె సీక్రెట్ గా అల్లు అర్జున్‌తో డేటింగ్ చేసిందన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ… వీరిద్దరి మధ్య సీక్రెట్ గా సంథింగ్ సంథింగ్ నడిచిందన్న పుకారు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఏదేమైనా మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కు జోడిగా ఆమె నటించిన రంగ రంగ వైభవంగా సినిమా హిట్ అయితే కేతిక శర్మను టాలీవుడ్ లో ఎవ్వరు ఆపలేరు అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news