Moviesర‌వితేజ‌పై టాలీవుడ్‌లో సెటైర్లు మామూలుగా లేవుగా... ముస‌లోడికి ఇదేం ప‌ని..!

ర‌వితేజ‌పై టాలీవుడ్‌లో సెటైర్లు మామూలుగా లేవుగా… ముస‌లోడికి ఇదేం ప‌ని..!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత నాలుగైదు సంవత్సరాలలో ఎన్నో సినిమాలు చేసినా సరైన సక్సెస్ లేదు. గత ఏడాది కరోనా తర్వాత వచ్చిన క్రాక్ సినిమా ఒక్కటే రవితేజ కెరీర్‌ను నిలబెట్టింది. అది కూడా డైరెక్టర్ మలినేని గోపీచంద్ పుణ్యమా అని రవితేజ ఖాతాలో చాలా రోజుల తర్వాత ఒక హిట్టు వచ్చింది. క్రాక్ అలా హిట్ అయిందో లేదో రవితేజ వెంటనే తన రెమ్యూనరేషన్ పెంచేశాడు. చివరకు రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను బాగా ఇబ్బంది పెట్టేవరకు రవితేజ వచ్చేసాడని… అసలు కథాకథనాలు పూర్తిగా వదిలేసి తనకు ఎంత ఇస్తారు ? ఎన్ని రోజులు కాల్షీట్లు కావాలి అన్న స్థాయికి దిగజారిపోయాడన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.

అందుకే ఈ ఏడాది ఇప్పటికే రిలీజ్ అయిన ఖిలాడి – రామారావు ఆన్‌ డ్యూటీ రెండు సినిమాలు ఘోరాతి ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. అయినా రవితేజ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇందులో ముందుగా న‌క్కిన త్రినాథ‌రావు దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. టాలీవుడ్‌లో తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపుతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ రవితేజకు జోడిగా నటిస్తోంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్… టీజర్లలో రవితేజ .. శ్రీలీల‌తో చేసిన రొమాన్స్ చూసిన టాలీవుడ్ జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు.

ఐదున్నర పదుల వయసు దాటేసిన మసలోడికి 20 ఏళ్ల వయసున్న శ్రీలలతో రొమాన్స్ ఏంటి ? ఆ టీజర్ లో రవితేజ ఎక్స్ప్రెషన్లు అసలు చూడలేకపోయాం రా బాబోయ్ అని తలలు బాదుకుంటున్నారు. రవితేజ చిన్న కుర్రాడు ఏం కాదు… తన వయసుకు తగ్గ పాత్రలు వేసుకోవాలి కానీ కుర్ర హీరోయిన్లను వెంటపెట్టుకుని ఇంకా కుర్ర హీరోయిన్లతో ప్రేమ కథలు… రొమాన్స్ లు అని చేసుకుంటూ పోతే ఖిలాడీ, రామారావు సినిమాల‌ లాగానే ప్రేక్షకులు డిజాస్టర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సీనియర్ హీరోలు, ప్రేమకథలతో సినిమాలు చేస్తే చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడరు.

అయినా కూడా రవితేజ ఈ వయసులో ఏజ్ బార్ అయిపోయినా… వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లతో లవ్ స్టోరీలు.. రొమాన్సులు చేస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ధమాకా నుంచి తాజాగా రిలీజ్ అయిన గ్లిమ్స్ లో రవితేజ – శ్రీలీలా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లలో రవితేజ ఫేసులో ఆ ఎక్స్ప్రెషన్లో అస్సలు చూడలేకపోయాం అని నెటిజన్లు ఆడుకుంటున్నారు ఏదైనా ధమాకా కూడా ప్లాప్ అయితే రవితేజను టాలీవుడ్ మర్చిపోయిందికు పెద్ద సమయం పట్టకపోవచ్చు. మరి రవితేజ ఇప్పటికైనా తన వయసుకు తగిన పాత్రలు ఎంపిక చేసుకుంటాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news