Moviesతమన్నా కోసం తన రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చేసిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో...

తమన్నా కోసం తన రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చేసిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో పెను సంచలనం..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా.. రేంజ్, క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది అంటెనే ఆమె అంటే జనాలకి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ డేస్ సినిమాతో హ్యాపీగా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన తమన్నా . ప్రజెంట్ చిరంజీవి సరసన భోళాశంకర్ సినిమా.. మరో రెండు సినిమాలు చేస్తూ కుర్ర బ్యూటీలకు సైతం అందంలో టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది.

కాగా తమన్నా తన ఇన్నాళ్ళ సినీ కెరియర్లో బోలెడు మంది హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తమన్నా తనతో యాక్ట్ చేసిన ఓ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తమన్నాతో కలిసి ఆవారా అనే సినిమా చేశాడు . ఆ తరువాత ఊపిరి అనే మూవీ కూడా చేసాడు. రెండు సినిమాలు హిట్టే.

ఈ సినిమా టైంలో వీళ్ళ మధ్య ప్రేమ చిగురించిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బోలెడు వార్తలు కోలీవుడ్ లో వైరల్ అయ్యాయి . అంతేనా పబ్లిక్ గానే వీళ్ళిద్దరూ మీడియా ముందు కనిపించడంతో ఆ వార్తలు నిజమే అంటూ అభిమానులు కూడా అనుకున్నారు. కాగా ఆ టైంలో ఓ న్యూస్ సంచలనంగా మారింది . హీరోయిన్ తమన్నా కోసం కార్తీక్ ఏకంగా తన ఓ సినిమా రెమ్యూనరేషన్ మొత్తాన్ని ఆమెకే ఇచ్చేశాడని..తమన్నా అంటే హీరో కార్తీకి చాలా ఇష్టం అని కోలీవుడ్లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అప్పటివరకు బాగానే ఉన్న ఈ జంట.. సడెన్ గా దూరమయ్యారు. దీంతో తమన్నా కార్తి బ్రేకప్ అంటూ మరో వార్త కూడా మీడియాలో హల్చల్ చేసింది .కానీ ఇప్పటివరకు దీనిపై అటు తమన్న ఇటు కార్తి ఇద్దరు స్పందించలేదు. కాగా తమన్నా ప్రజెంట్ సినిమాలతో బిజీగా ఉంది. కార్తీక్ కూడా తనకొచ్చిన సినిమాల్లో నచ్చిన సినిమాలు చేసుకుంటూ హీరోగా ముందుకు వెళ్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news