Moviesస‌లార్ రీలిజ్ డేట్ వ‌చ్చేసింది... అయినా నిరాశ ప‌రిచారే...!`

స‌లార్ రీలిజ్ డేట్ వ‌చ్చేసింది… అయినా నిరాశ ప‌రిచారే…!`

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ , కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వస్తున్నసినిమా ‘సలార్‌స‌ . ఈ సినిమా అప్‌డేట్ల‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు స్వ‌తంత్ర దినోత్స‌వం రోజున చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేజీయ‌ఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా శ్రుతీ హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించినా ఇంకా యేడాదికి పైగా టైం ఉండ‌డంతో ఫ్యాన్స్ మాత్రం నిరాశ‌లోనే ఉన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news